Warangal | కుంటను మట్టితో పూడ్చి.. BRS పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు: శంకుస్థాపన చేసిన KTR

Warangal పుల్లాయకుంట స్థలం వివాదాస్పదం ఎమ్మెల్యే నన్నపనేనిపై ఆరోపణలు ప్రేక్షక పాత్ర వహించిన అధికారులు? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శిలాఫలకం వేసిన స్థలం వివాదాస్పదమైనదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రికి రాత్రే వరంగల్ రంగసాయిపేట శివారు పుల్లాయికుంట స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం కేటాయించి కుంటను పూడ్చి పార్టీ కార్యాలయం నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేటీఆర్ […]

Warangal | కుంటను మట్టితో పూడ్చి.. BRS పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు: శంకుస్థాపన చేసిన KTR

Warangal

  • పుల్లాయకుంట స్థలం వివాదాస్పదం
  • ఎమ్మెల్యే నన్నపనేనిపై ఆరోపణలు
  • ప్రేక్షక పాత్ర వహించిన అధికారులు?

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శిలాఫలకం వేసిన స్థలం వివాదాస్పదమైనదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రాత్రికి రాత్రే వరంగల్ రంగసాయిపేట శివారు పుల్లాయికుంట స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం కేటాయించి కుంటను పూడ్చి పార్టీ కార్యాలయం నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కేటీఆర్ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తారా లేదా అనే అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి. అయితే చివరికి కేటీఆర్ శుక్రవారం రాత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి.

పుల్లాయకుంట స్థలాన్ని మట్టితో పూడ్చి కార్యాలయ నిర్మాణానికి వాడుకోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులు కూడా అధికార పార్టీ తీరును చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ముఖ్యంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ముందుండి కుంటను పూడుస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం పట్ల విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు హాజరయ్యారు.