Warangal | సమస్యల పరిష్కారానికి చీఫ్‌విప్ దాస్యం ప్రజలతో ముఖాముఖి

Warangal కాజిపేట అభివృద్ధికి నిరంతరం కృషి ప్రజలకు చేరువయ్యేందుకే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ ముఖాముఖి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వివరించారు. కాజీపేటలో మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ షేక్ బాషా, కార్పొరేటర్లు, అన్ని విభాగాల అధికారులతో కలిసి ఈ ముఖాముఖిని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికుల నుండి […]

Warangal | సమస్యల పరిష్కారానికి చీఫ్‌విప్ దాస్యం ప్రజలతో ముఖాముఖి

Warangal

  • కాజిపేట అభివృద్ధికి నిరంతరం కృషి
  • ప్రజలకు చేరువయ్యేందుకే కార్యక్రమం
  • రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ ముఖాముఖి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వివరించారు. కాజీపేటలో మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ షేక్ బాషా, కార్పొరేటర్లు, అన్ని విభాగాల అధికారులతో కలిసి ఈ ముఖాముఖిని నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానికుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని చీఫ్ విప్ అధికారులను ఆదేశించారు. అనంతరం వినయ్‌ మాట్లాడుతూ
కాజిపేట్ ప్రాంత అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తునన్నారు. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి పలు దశలుగా ఈ ప్రాంత అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.

అన్ని మతాల ప్రజలు భాయ్ భాయ్ అనే సిద్ధాంతంతో స్నేహ పూర్వకంగా మెలగడం కాజిపేట్ ప్రత్యేకత అని అన్నారు. అట్లాగే ప్రజల నుండి మున్సిపల్ సంబంధిత, విద్యుత్, రోడ్లు, ఆరోగ్యపర ఫించన్లు, మిషన్ భగీరథ, స్మశాన వాటికలు ఇలా పలు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.