Warangal: ఇక్కడ ఇతర పార్టీలకు డిపాజిట్ దక్కదు.. పోటీ చేయాలంటే భయపడాలి: మంత్రి సత్యవతి
మానుకోటను అభివృద్ధి చేసుకున్నాం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇంకో పార్టీ పోటీ చేయాలంటే భయపడే విధంగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ ప్రాంతంలో ఇతర పార్టీలకు డిపాజిట్ దక్కే అవకాశం లేదని ధీమా వ్యక్తంచేశారు. ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు. మానుకోటను నలువైపులా అభివృద్ధి చేసుకున్నామన్నారు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ఆర్తిగార్డెన్స్ లో నిర్వహించిన బీఆర్ఎస్ […]

- మానుకోటను అభివృద్ధి చేసుకున్నాం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇంకో పార్టీ పోటీ చేయాలంటే భయపడే విధంగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ ప్రాంతంలో ఇతర పార్టీలకు డిపాజిట్ దక్కే అవకాశం లేదని ధీమా వ్యక్తంచేశారు. ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు. మానుకోటను నలువైపులా అభివృద్ధి చేసుకున్నామన్నారు.
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ఆర్తిగార్డెన్స్ లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు యావత్ దేవానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.
కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ ఫరీద్ బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.