WARANGAL వెరైటీ ‘రాజనాల’: నాడు కోడి పిల్ల, క్వార్టర్ గిఫ్ట్‌.. ఇవ్వాల జాకెట్ ముక్క, టవల్. రూ.116 నగదు గిఫ్ట్‌

ఆయనో వెరైటీ కార్యక్రమాల రాజనాల కేసీఆర్ బర్త్ డే గిఫ్ట్ పంపిణీ జాకెట్ ముక్క టవల్ రూ.116 సిట్టింగ్ అంటే ఆయనకు గిట్టదు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆయన వెరైటీ కార్యక్రమాల నాయకుడూ.. ఏది చేసినా ఆసక్తికరమైనదిగానో.. చర్చనీయాంశంగానో ఉండాలనుకుంటాడు. ఇదొక్క విషయమే కాదూ.. తక్కువ ఖర్చు ఎక్కువ ప్రచారం అనేది కొనసాగాలంటే వెరైటీలను లేదా? కాంట్రవర్సీగానో ఉంటేనే కదా! చర్చ సాగేది. అందుకే మొదటి నుంచి అదే మార్గాన్ని ఎంచుకొని తన పేరు వార్తల్లో […]

WARANGAL వెరైటీ ‘రాజనాల’: నాడు కోడి పిల్ల, క్వార్టర్ గిఫ్ట్‌.. ఇవ్వాల జాకెట్ ముక్క, టవల్. రూ.116 నగదు గిఫ్ట్‌
  • ఆయనో వెరైటీ కార్యక్రమాల రాజనాల
  • కేసీఆర్ బర్త్ డే గిఫ్ట్ పంపిణీ
  • జాకెట్ ముక్క టవల్ రూ.116
  • సిట్టింగ్ అంటే ఆయనకు గిట్టదు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆయన వెరైటీ కార్యక్రమాల నాయకుడూ.. ఏది చేసినా ఆసక్తికరమైనదిగానో.. చర్చనీయాంశంగానో ఉండాలనుకుంటాడు. ఇదొక్క విషయమే కాదూ.. తక్కువ ఖర్చు ఎక్కువ ప్రచారం అనేది కొనసాగాలంటే వెరైటీలను లేదా? కాంట్రవర్సీగానో ఉంటేనే కదా! చర్చ సాగేది. అందుకే మొదటి నుంచి అదే మార్గాన్ని ఎంచుకొని తన పేరు వార్తల్లో వ్యక్తిగా కొనసాగేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆయన పేరు రాజనాల శ్రీహరి. ప్రస్తుతం వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ పార్టీలో నాయకునిగా కొనసాగుతున్నారు.

జాకెట్ ముక్క, టవల్ రూ.116 బర్త్ డే గిఫ్ట్

ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా వరంగల్ చౌరస్తాలో శుక్రవారం మహిళలకు ఒక టవల్, జాకెట్ ముక్క, రెండు అరటి పండ్లు రూ.116 నగదుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చోటా మోటా పథకాలన్నింటి పేర్లు ముద్రించారు. అందులో కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లితో పాటు తన బొమ్మ వేసుకొని ఉన్న 2023 సంవత్సరం క్యాలెండర్‌ను అందజేసి మరోసారి చర్చకు దారి తీశారు.

సిట్టింగు ఎమ్మెల్యే అంటే గిట్టదూ

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీలో కొనసాగారు. కొద్ది కాలం క్రితం గులాబీ గూటికి చేరారు. ఏ పార్టీలో ఉన్న అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉండడమే ఆయన విధానం ఉన్నట్లుగా కొనసాగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే బసవరాజు వ్యతిరేకంగా పార్టీలో ఉన్నంతకాలం పనిచేశారు. ప్రస్తుతం గులాబీ పార్టీలో కూడా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ వ్యతిరేక వర్గంలో తన దైన పాత్రను పోషిస్తున్నాడు. నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం జన్మదిన ఉత్సవాలకు శ్రీహరి దూరంగా ఉన్నారు.

చిత్రం ఏమిటంటే శ్రీహరి, సారయ్య ఇద్దరు ఇప్పుడు నన్నపనేని వ్యతిరేక వర్గంలోనే ఉండటం విశేషం. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేందుకు ‘ఒంటరిగా’ అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలతో మెరుస్తుంటాడు. హమాలీ కార్మికులకు దసరా రోజు కోడి పిల్ల, క్వార్టర్ బాటిల్ పంపిణీ చేసి చర్చల్లో నిలిచినట్టూ.. ఎండా కాలం వీధి వ్యాపారులకు కేటీఆర్ పేరుతో రాసిన గొడుగులు అందజేసి నట్లూ.. చలికాలం అర్ధరాత్రి అనాధలకు రోడ్డుపై నిద్రిస్తున్న వారికి దుప్పట్లు అందజేసే కార్యక్రమాలు చేపడుతుంటారు. ప్రస్తుతం సీఎం గిఫ్ట్ అందజేసి మరోసారి చర్చల్లో నిలిచారు.