Warangal | వోపా ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
Warangal విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (వోపా) ఉమ్మడి వరంగల్ జిల్లా ఆద్వర్యంలో పదవతరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. సోమవారం హనుమకొండలో వోపా ఆధ్వర్యంలో వోపా అధ్యక్షులు శ్రీరామోజు నాగరాజా రావు అధ్యక్షతన జరిగింది. విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు,విశ్వబ్రాహ్మణ వైద్యులకు సన్మానాలు,కేయూ విశ్రాంత ఆచార్యులు కొక్కొండ విజయబాబుకు సత్కార కార్యక్రమం జరిగింది. - విద్యార్థులు వీరే పదవ తరగతిలో ప్రధమ […]

Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (వోపా) ఉమ్మడి వరంగల్ జిల్లా ఆద్వర్యంలో పదవతరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. సోమవారం హనుమకొండలో వోపా ఆధ్వర్యంలో వోపా అధ్యక్షులు శ్రీరామోజు నాగరాజా రావు అధ్యక్షతన జరిగింది.
విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు,విశ్వబ్రాహ్మణ వైద్యులకు సన్మానాలు,కేయూ విశ్రాంత ఆచార్యులు కొక్కొండ విజయబాబుకు సత్కార కార్యక్రమం జరిగింది.
– విద్యార్థులు వీరే
పదవ తరగతిలో ప్రధమ పురస్కారం బోల్లోజు వైశాలి, ద్వితీయ పురస్కారం సిద్దోజు హంసిక, తృతీయ పురస్కారం ఎటికాల పల్లవికి అందించారు. వీరితో పాటు మరొక ఐదుగురికి కన్సోలేషన్ పురస్కారాలు అందించారు. ఇంటర్మీడియట్ లో ప్రధమ పురస్కారం బెజ్జంకి సంజన, ద్వితీయ పురస్కారం బాలోజు శ్రీవాస్య, తృతీయ పురస్కారం బెజ్జంకి అంజనకు అందించారు. వీరితో పాటు మరొక నలుగురికి కన్సోలేషన్ పురస్కారాలు అందించారు. వీరందరికి నగదు పారితోషికం, షీల్డ్, శాలువాతో సత్కరించారు.
దీంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్య వృత్తిలో ఉన్న సుమారు 25 మంది వైద్యులను,కేయూ విశ్రాంత ఆచార్యులు కొక్కొండ విజయ బాబు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వోపా వ్యవస్థాపకులు,రాష్ట్ర కన్వీనర్ వేములవాడ ద్రోణాచారి మాట్లాడుతూ వోపా వరంగల్ ఉమ్మడి జిల్లా ఆద్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. రాబోయె కాలంలో విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టాలని అందుకు రాష్ట్ర వోపా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.
వోపా ఆద్వర్యంలో నిర్వహించిన,నిర్వహించే కార్యక్రమాల తీరుతెన్నులను వివరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ వరంగల్ ఉమ్మడి జిల్లా వోపా కార్యవర్గం ఏర్పాటైన అనతికాలంలోనే ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన తీరు గర్హనీయమన్నారు. విశ్వబ్రాహ్మణ జాతీయులు వోపా నిర్వహించే మంచి కార్యక్రమాలకు అండగా ఉండి ముందుకు నడిపించాలని కోరారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ రాష్ట్ర సంఘం పక్షాన వోపాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వోపా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం విశ్వబ్రాహ్మణ జాతీయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసి వారి మన్ననలను పొందాలన్నారు.
కార్యక్రమంలో వోపా రాష్ట్ర కో కన్వీనర్ కట్టా విష్ణువర్ధన్,పరకాలలోని ఎస్వీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ సిరికొండ శ్రీనివాస చారి, వోపా గౌరవాధ్యక్షులు సంగోజు మోహన్ అసోయేట్ అధ్యక్షులు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్,ప్రధాన కార్యదర్శి మహేశ్వరం భిక్షపతి,కోశాధికారి శ్రీరామోజు వెంకటేశ్వర్లు, డాక్టర్లు పొలాస రమేష్, వంగల మోహన్ రావు, భరత్ కుమార్,ఆచార్య కొక్కొండ విజయ బాబు, జర్నలిస్టులు సంగోజు రవి, సలేంద్ర రవీందర్,విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వీణవంక సదానందం,హనుమకొండ జిల్లా అధ్యక్షులు అలుగోజు కృష్ణమూర్తి,ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు నాగసోమేశ్వర్,గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి మహరాజు భరత్,మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కర్ణెకంటి భారతి,నాయకులు రావుల కొలను రామమూర్తి,ఆకోజు సురేందర్ రావు,ములుకోజు ప్రకాశం,పిన్నోజు ప్రవీణ్,అడ్లూరి మల్లిఖార్జున్,కలకొండ రాంప్రసాద్,పొనుగోటి సారంగపాణి,పలువురు వైద్యులు,విద్యార్థుల తల్లిదండ్రులు, విశ్వబ్రాహ్మణ జాతీయులు పాల్గొన్నారు.