Khammam: BRSతో కలిసే ఎన్నికలకు వెళ్తాం: తమ్మినేని వీరభద్రం

విధాత: సిపిఎం, సిపిఐ పార్టీలు బిఆర్ఎస్ పార్టీతో కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాయని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్ల గూడెంలో ఆయన మాట్లాడుతూ పొత్తుల్లో భాగంగా సిపిఎం, సిపిఐ కి సీట్ల కేటాయింపు ఉంటుందని, అయితే ఎన్ని సీట్లు.. ఏ సీట్లు అన్న విషయం ఇప్పుడే చెబితే పొత్తులో చిక్కులు వస్తాయన్నారు. సీట్ల కేటాయింపులో పాలేరు నియోజకవర్గం నెంబర్ వన్‌గా ఉండడం […]

Khammam: BRSతో కలిసే ఎన్నికలకు వెళ్తాం: తమ్మినేని వీరభద్రం

విధాత: సిపిఎం, సిపిఐ పార్టీలు బిఆర్ఎస్ పార్టీతో కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాయని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్ల గూడెంలో ఆయన మాట్లాడుతూ పొత్తుల్లో భాగంగా సిపిఎం, సిపిఐ కి సీట్ల కేటాయింపు ఉంటుందని, అయితే ఎన్ని సీట్లు.. ఏ సీట్లు అన్న విషయం ఇప్పుడే చెబితే పొత్తులో చిక్కులు వస్తాయన్నారు.

సీట్ల కేటాయింపులో పాలేరు నియోజకవర్గం నెంబర్ వన్‌గా ఉండడం మాత్రం ఖాయమన్నారు. సిపిఎం పార్టీకి పాలేరు సీటును బిఆర్ఎస్ ఖాయంగా కేటాయిస్తుందని భావిస్తున్నామన్నారు. మంచిని కోరే ప్రతి ఒక్కరి ఓటు మాకు పడాలన్నారు.

దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు బిజెపికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నాయని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందన్నారు. రాష్ట్ర అధికారాలను హరించే రీతిలో ప్రతి మోటార్ కి మీటర్ పెట్టి ఫీజు వసూలు చేయాలని కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. రాష్ట్రం విద్యుత్ ఫ్రీగా ఇచ్చినప్పటికీ కేంద్రం అడ్డుపడుతుందని, ఇలాంటి దుష్ట బిజెపి అధికారంలో ఉంటే దేశానికి ప్రమాదం అన్నారు.

బిజెపి అధికారంలో కొనసాగితే బ్రిటిష్ వారి కాలంలో రాజ్యాలుగా ఎలా ఘర్షణ పడ్డామో అట్లాంటి పాత రోజులకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. అందుకే వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ గతంలో బిజెపిని మెచ్చుకొని పార్లమెంటులో బిజెపి తెచ్చిన చట్టాలకి, జీవోలకు మద్దతిచ్చాడన్నారు.

బిజెపి తెలంగాణ అభివృద్ధిపై కక్ష కట్టి రాష్ట్రాన్ని వెనుకబాటుకు గురి చేస్తుండటంతో కేసీఆర్ మేల్కొని బీజేపీని గద్దె దించాలని పోరాడుతున్నాడన్నారు. బిజెపిని తెలంగాణలో నిలువరించే లక్ష్యంతో బిఆర్ఎస్‌తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు.