Gangula Kamalakar | 9న బీసీ కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం.. దరఖాస్తులకు ఆహ్వానం
Gangula Kamalakar విధాత: బీసీ కులవృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించి విధి విధానాలు ఖరారయ్యాయి. బీసీ కులాల్లోని కులవృత్తులు, చేతివృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని గత నెలలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దరఖాస్తులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) దరఖాస్తులకు […]

Gangula Kamalakar
విధాత: బీసీ కులవృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించి విధి విధానాలు ఖరారయ్యాయి. బీసీ కులాల్లోని కులవృత్తులు, చేతివృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని గత నెలలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్లో నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దరఖాస్తులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) దరఖాస్తులకు సంబంధించిన వెబ్సైట్ను ఆవిష్కరించారు.
బీసీల్లోని కులవృత్తులు, చేతివృత్తుల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోటో, ఆధార్, కులదృవీకరణ పత్రం సహా 38 కాలమ్ లతో సరళమైన అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ. లక్ష ఆర్థిక సాయం ద్వారా కులవృత్తి, చేతివృత్తులకు సంబంధించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలుకు వినియోగించనున్నారు. https://tsobmmsbc.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక ఈ కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీన మంచిర్యాల జిల్లా వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నారు.