చేపల వేటకు వెళ్లి.. మత్స్యకారుడు మృతి

విధాత: నల్లగొండ జిల్లా కనగల్ మండలం లోని జి.ఎడవల్లి గ్రామంలో మత్స్య కార్మికుడు గంట శ్రీను ముదిరాజ్ (40) జీవనోపాధి కోసం రోజువారీ మాదిరిగా చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కాళ్లకు వల చుట్టుకోని మృతి చెందాడు. శ్రీనుకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని శ్రీను కుటుంబం ఆయన మృతితో కుటుంబ పెద్దను కోల్పోయింది. ప్రభుత్వం శ్రీను కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన వెంకటరమణ కోరారు. […]

  • By: krs    latest    Mar 13, 2023 1:10 PM IST
చేపల వేటకు వెళ్లి.. మత్స్యకారుడు మృతి

విధాత: నల్లగొండ జిల్లా కనగల్ మండలం లోని జి.ఎడవల్లి గ్రామంలో మత్స్య కార్మికుడు గంట శ్రీను ముదిరాజ్ (40) జీవనోపాధి కోసం రోజువారీ మాదిరిగా చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కాళ్లకు వల చుట్టుకోని మృతి చెందాడు. శ్రీనుకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు.

రెక్కాడితే కానీ డొక్కాడని శ్రీను కుటుంబం ఆయన మృతితో కుటుంబ పెద్దను కోల్పోయింది. ప్రభుత్వం శ్రీను కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన వెంకటరమణ కోరారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఆయన వెంట సంఘం నాయకులు కొరివి కృష్ణయ్య, బొమ్మకంటి లింగుస్వామి,కాడింగి నాగరాజు, పుట్టాల సైదులు, బొడ్డుపల్లి సైదులు, బొడ్డు సతీష్,కొరివి ధనరాజ్, గంట మహేష్, జడిగల నాగేంద్ర తదితరులు ఉన్నారు.