Bangalore | బెంగ‌ళూరులో న‌యా గాంధీ.. త‌న ఇంటి ముందు కార్ పార్క్ చేస్తే ఏం చేశాడో తెలుసా?

Bangalore విధాత‌: వాహ‌నాల సంఖ్య ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరిగిపోయిన నేప‌థ్యంలో ఇరుగుపొరుగు మ‌ధ్య కార్ల పార్కింగ్ విష‌యంలో త‌గువులు చూస్తూనే ఉంటాం. ఆ అంశంలో త‌న పొరుగు వారితో ఇబ్బంది ప‌డుతున్న ఓ వ్య‌క్తి చేసిన ప‌ని ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఇంటి ముందు పొరుగు వ్య‌క్తి త‌న కారును పార్కింగ్ చేయ‌డం మొద‌లుపెట్టాడు. కాగా.. కొన్ని రోజులుగా ఇది జ‌రుగుతుండ‌గా.. త‌న ఇంటి ముందు కారు నిల‌ప‌వ‌ద్ద‌ని ఆ వ్య‌క్తిని ప‌లుమార్లు అభ్య‌ర్థించాడు. అయినా […]

  • By: Somu    latest    Jul 02, 2023 10:51 AM IST
Bangalore | బెంగ‌ళూరులో న‌యా గాంధీ.. త‌న ఇంటి ముందు కార్ పార్క్ చేస్తే ఏం చేశాడో తెలుసా?

Bangalore

విధాత‌: వాహ‌నాల సంఖ్య ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరిగిపోయిన నేప‌థ్యంలో ఇరుగుపొరుగు మ‌ధ్య కార్ల పార్కింగ్ విష‌యంలో త‌గువులు చూస్తూనే ఉంటాం. ఆ అంశంలో త‌న పొరుగు వారితో ఇబ్బంది ప‌డుతున్న ఓ వ్య‌క్తి చేసిన ప‌ని ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఇంటి ముందు పొరుగు వ్య‌క్తి త‌న కారును పార్కింగ్ చేయ‌డం మొద‌లుపెట్టాడు.

కాగా.. కొన్ని రోజులుగా ఇది జ‌రుగుతుండ‌గా.. త‌న ఇంటి ముందు కారు నిల‌ప‌వ‌ద్ద‌ని ఆ వ్య‌క్తిని ప‌లుమార్లు అభ్య‌ర్థించాడు. అయినా లాభం లేక‌పోవ‌డంతో ఒక రిక్వెస్టు నోట్ రాసి.. త‌న ఇంటి ముందు పెట్టిన కారుకు అంటించాడు. ద‌యచేసి మీరు కారును ఇక్క‌డ పార్క్ చేయొద్దు. గ‌తంలో ప‌లుమార్లు మీకు ఈ సంగ‌తి చెప్పాను. ఇక్క‌డ మేము 2000వ సంవ‌త్స‌రం నుంచి ఉంటున్నాం.

ప్ర‌స్తుతం మాకు రెండు కార్లున్నాయి. వాటిని పెట్ట‌డానికే మా ఇంటి ముందున్న స్థ‌లం స‌రిపోతుంది. మీరు ఇంత‌కుముందు ఎక్క‌డ కారు పెట్టేవారో అక్క‌డే పార్కింగ్ కొన‌సాగించండి. మీరు మంచి నైబ‌ర్‌గా ఉంటార‌ని ఆశిస్తున్నాం అని ఆ లేఖ‌లో రాశారు.

దీనిని సుభాశిస్ దాస్ అనే వ్య‌క్తి ఫొటో తీసి ట్వీట్ చేశాడు. బెంగ‌ళూరు (Bengaluru) లోని కోర‌మంగ‌ళ‌లో ఈ ఎపిక్ నోట్‌ను చూశాన‌ని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అయితే ఈ కారు త‌న‌ది కాద‌ని.. రోడ్ల‌పై న‌డుస్తున్న‌పుడు క‌నిపిస్తే ఫొటో తీశాన‌ని తెలిపాడు.

దీనిపై యూజ‌ర్లు ప‌లు ర‌కాలుగా స్పందించారు. ఇది ఒక అద్భుత‌మైన లేఖ అని ఒక‌రు రాయ‌గా.. ఇదే దిల్లోలోనో గురుగ్రాంలోనో అయ్యుంటే ఈ పాటికి చిన్న యుద్ధం జ‌రిగి ఉండేద‌ని మ‌రొక‌రు స్పందించారు. ఈ లేఖ నా కారుపై కానీ క‌నిపిస్తే.. అది రాసిన వారికి క్ష‌మాప‌ణ చెప్పి టీకి ఆహ్వానిస్తామ‌ని వ్యాఖ్యానించాడు.