The Elephant Whisperers | ఏనుగు కథను వరించిన ఆస్కార్‌..! ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ స్టోరీ ఏంటో తెలుసా..?

The Elephant Whisperers | ప్రపంచవ్యాప్తంగా సినీరంగంలో ప్రతిష్టాత్మక అవార్డుగా ఆస్కార్‌ను భావిస్తుంటారు. అమెరికా లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ అవార్డుల పండుగ ఘనంగా సాగింది. భారతదేశం నుంచి అవార్డులకు మూడు చిత్రాలు నామినేట్‌ కాగా.. ఇందులో రెండింటికి అవార్డులు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా విమర్శల ప్రశంసలు అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యింది. ఈ సాంగ్‌కు మాత్రమే ఆస్కార్‌ పక్కా అని అందరూ భావించారు. కానీ, ఎలాంటి […]

The Elephant Whisperers | ఏనుగు కథను వరించిన ఆస్కార్‌..! ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ స్టోరీ ఏంటో తెలుసా..?

The Elephant Whisperers | ప్రపంచవ్యాప్తంగా సినీరంగంలో ప్రతిష్టాత్మక అవార్డుగా ఆస్కార్‌ను భావిస్తుంటారు. అమెరికా లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ అవార్డుల పండుగ ఘనంగా సాగింది. భారతదేశం నుంచి అవార్డులకు మూడు చిత్రాలు నామినేట్‌ కాగా.. ఇందులో రెండింటికి అవార్డులు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా విమర్శల ప్రశంసలు అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యింది. ఈ సాంగ్‌కు మాత్రమే ఆస్కార్‌ పక్కా అని అందరూ భావించారు. కానీ, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగం ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ ఆస్కార్‌ను ఎగరేసుకొని పోయింది. ఈ క్రమంలో అందరు అసలు ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ అవార్డు ఎందుకు వచ్చింది? షార్ట్‌ ఫిల్మ్‌ స్టోరీ ఏంటంటూ పలువురు ఆరా తీస్తున్నారు. మరి ఆ స్టోరీ ఏంటీ.. ఓ సారి తెలుసుకుందాం రండి..!

జంతవుల మధ్య జీవనం సాగించే దంపతుల కథ..

ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ కథ గిరిజనగూడానికి చెందిన ఇద్దరు దంపతుల కథ. ఆ దంపతులిద్దరు ఏడు పిల్లలను పెంచేవారిగా జీవనం కొనసాగిస్తుంటారు. టీవీలు, మొబైల్‌ ఫోన్లకు దూరంగా ప్రకృతి ఒడిలో జీవితం గడుపుతారు. ఈ ఇద్దరు వృద్ధ దంపతులు ఏనుగులనే పిల్లలుగా భావిస్తూ వాటికి పేర్లు పెట్టి.. పెంచుతారు. పెద్ద అయిన ఏనుగులను అటవీ అధికారులు తీసుకువెళ్లిపోయారు. ఆ సమయంలో ఆ వృద్ధ జంట పడే మనో వేధన, పిల్లలు దూరం అవుతున్నారనే బాధ వాళ్లలో కనిపిస్తుంటుంది. ఈ కథ ఇతివృత్తాంతంగా ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ కథను తెరకెక్కించారు.

తల్లి చనిపోయిన ఏనుగు పిల్లలను..

తమిళనాడు రాష్ట్రం ముదుమలైన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఓ గిరిజన గూడెం ఉంటుంది. అటవీ ప్రాంతంలో ఏనుగు పిల్లలు.. లేదంటే ప్రమాదంలో తల్లి చనిపోయిన తర్వాత అనాధగా మారిన ఏనుగు పిల్లలను అటవీ అధికారులు ఆ వృద్ధ జంటకు ఇచ్చి వాటిని పెంచమంటారు. అందు కోసం అధికారులు కొంత డబ్బును అందజేస్తారు. దీని కోసం ఆ గిరిజన గూడెంలో ఎలిఫెంట్ ఫీడింగ్ సెంటర్ సైతం నిర్వహిస్తారు. అటవీ అధికారులు ఇచ్చే ఏనుగు పిల్లలను వృద్ధ జంట తమ సొంత పిల్లలుగా పెంచుతారు. ఏనుగు పిల్లకు రఘు అని నామకరణం చేస్తారు. ఉదయం నిద్రలేపి స్నానం చేయించడంతో పాటు ఆహారాన్ని అందిస్తారు. పాలు పట్టించడం, ఆటలు ఆడించడం, వ్యాయామం సైతం చేయిస్తారు. పండుగలకు అందంగా అలంకరించి పూజలు కూడా చేస్తారు. సొంత బిడ్డను సాకినట్లు సాకుతూ వస్తుంటారు. ఈ కథ తెరపై చాలా నేచరుల్‌గా ఉంటుంది. ప్రతి సీన్‌ అందరినీ హృదయాలను తాకుతుంది.

డాక్యుమెంటరీ ఐదేళ్ల కష్టం..

ఈ డాక్యుమెంటరీని తీయడానికి ఐదేళ్ల సమయం పట్టింది. ఇందుకంటే ఇతర సినిమాల్లో చిన్న సమయంలో ఓ ఏనుగు పిల్లను.. పెద్దయ్యాక మరో ఏనుగును చూపించలేదు. ఒకే ఏనుగు పిల్లనే పెరిగి పెద్దయ్యే వరకు చిత్రీకరించారు. పిల్ల నుంచి ఐదేళ్ల వరకు ఎలా పెరిగింది అనేది దగ్గరుండి చిత్రీకరించారు డైరెక్టర్‌ కార్తికీ గొన్సాల్వేస్‌. ఈ డాక్యుమెంటరీని చిత్రీకరణకు పడిన ఐదేళ్ల కష్టం తెరపై కనిపిస్తుంది. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ చూస్తున్నంత సేపు మనసును హత్తుకునేలా ఉంటుంది. మనుషులు, జంతువుల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? గిరిజనగూడెం, అటవీ ప్రాంతాల్లోని వ్యక్తులు జంతువులను ఎలా ప్రేమిస్తారనే కళ్లకు కట్టినట్లుగా చూపించారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. నెట్‌ ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది. దీన్ని బట్టే తెలుస్తుంది షార్ట్‌ ఫిలిం సత్తా ఏంటో. అందుకే చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకు ఆస్కార్‌ను అందుకున్నది. ఇప్పటి వరకు ఈ కేటగిరిలో భారత్‌ ఆస్కార్‌ అవార్డు దక్కలేదు. ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ ఈ కేటగిరిలో భారత్‌కు అవార్డును తీసుకువచ్చింది.