WhatsApp | వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..! ఇకపై మొబైల్‌ నంబర్‌తోనే వాట్సాప్‌ వెబ్‌ కనెక్ట్‌ చేసుకోవచ్చు..!

WhatsApp | ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తున్నది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల కోసం ఎన్నో ఫీచర్లను తీసుకువచ్చిన కంపెనీ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నది. అయితే, ఈ ఫీచర్‌ కేవలం వాట్సాప్‌ యూజర్లకు మాత్రమే. ఇప్పటి వరకూ వాట్సాప్‌ను డెస్క్‌టాప్‌లో వాడుకోవాలంటే క్యూఆర్‌ కోడ్‌ను మాత్రమే స్కాన్‌ చేయాల్సి వచ్చేది. దాంతో ఫోన్‌ దగ్గరలేకపోయినా, ఫోన్‌లో కెమెరా పాడైనా కనెక్ట్‌ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ […]

WhatsApp | వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..! ఇకపై మొబైల్‌ నంబర్‌తోనే వాట్సాప్‌ వెబ్‌ కనెక్ట్‌ చేసుకోవచ్చు..!

WhatsApp | ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తున్నది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల కోసం ఎన్నో ఫీచర్లను తీసుకువచ్చిన కంపెనీ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నది. అయితే, ఈ ఫీచర్‌ కేవలం వాట్సాప్‌ యూజర్లకు మాత్రమే. ఇప్పటి వరకూ వాట్సాప్‌ను డెస్క్‌టాప్‌లో వాడుకోవాలంటే క్యూఆర్‌ కోడ్‌ను మాత్రమే స్కాన్‌ చేయాల్సి వచ్చేది. దాంతో ఫోన్‌ దగ్గరలేకపోయినా, ఫోన్‌లో కెమెరా పాడైనా కనెక్ట్‌ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో వీటికి చెక్‌ పెడుతూ మొబైల్‌ నంబర్‌ ఆధారంగా లాగిన్‌ చేసుకునే వీలు కల్పిస్తున్నది. వాట్సాప్‌ బీటాఇన్ఫో ప్రకారం.. 2.23.14.18 బీటా వెర్షన్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొన్ని నాన్ బీటా వెర్షన్ యూజర్లకు సైతం అందుబాటులో ఉంచింది. మొబైల్‌లో కెమెరా పని చేయని వారికి, క్యూఆర్ కోడ్ స్కానింగ్‌ల ఇబ్బందులున్న వారికి ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది.

వాట్సాప్‌ ఫీచర్‌ను ఎలా వాడాలంటే..?

మొదట వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత డెస్క్‌టాప్‌లో వెబ్‌వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి. అక్కడ లింక్ వెబ్ అకౌంట్ విత్ ఏ ఫోన్ నంబర్ అన్న ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇది క్యూ ఆర్ కోడ్ కింద ఉంటుంది. ఏ అకౌంట్‌ను అయితే లింక్ చేయాయాలనుకొంటున్నారో ఆ అకౌంట్‌కు సంబంధించిన ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఫోన్‌కు ఓ నోటిఫికేషన్‌ వస్తుంది. అందులో డెస్క్‌టాప్‌పై కనిపించే కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. దాంతో వెబ్‌వాట్సాప్‌ కనెక్ట్‌ అవుతుంది. అయితే, ఈ ఫీచర్‌ వెబ్‌వాట్సాప్‌ యూజర్లకు మాత్రమే పని చేస్తుంది.