WhatsApp | త్వరలో క్రాప్‌ ఫీచర్‌ను పరిచయం చేయనున్న వాట్సాప్‌..! ఎలా వాడాలో తెలుసుకోండి మరి..!

WhatsApp | వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తుంది ఇన్‌స్టంట్‌ మెస్సేజ్‌ యాప్‌ వాట్సాప్‌. ఇప్పటికే ఎన్నో సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేసిన వాట్సాప్‌.. త్వరలోనే సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్నది. వాట్సాప్‌లోనే నచ్చినట్లుగా ఫొటోలను క్రాప్‌ చేసుకునేలా ఫీచర్‌ను తీసుకురానున్నది. ఇందుకు సంబంధించిన టూల్‌ను ప్రస్తుతం మెటా యాజమాన్యంలోని కంపెనీ అభివృద్ధి చేస్తున్నది. ఈ విషయాన్ని వాబీటాఇన్ఫో (WABetaInfo) కొత్త క్రాప్ (Crop) ఫీచర్ గురించి వెల్లడించింది. స్మార్ట్ ఫోన్స్‌, ల్యాప్ టాప్, డెస్క్‌టాప్‌లో ఇమేజెస్‌ను […]

WhatsApp | త్వరలో క్రాప్‌ ఫీచర్‌ను పరిచయం చేయనున్న వాట్సాప్‌..! ఎలా వాడాలో తెలుసుకోండి మరి..!

WhatsApp | వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తుంది ఇన్‌స్టంట్‌ మెస్సేజ్‌ యాప్‌ వాట్సాప్‌. ఇప్పటికే ఎన్నో సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేసిన వాట్సాప్‌.. త్వరలోనే సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్నది. వాట్సాప్‌లోనే నచ్చినట్లుగా ఫొటోలను క్రాప్‌ చేసుకునేలా ఫీచర్‌ను తీసుకురానున్నది. ఇందుకు సంబంధించిన టూల్‌ను ప్రస్తుతం మెటా యాజమాన్యంలోని కంపెనీ అభివృద్ధి చేస్తున్నది. ఈ విషయాన్ని వాబీటాఇన్ఫో (WABetaInfo) కొత్త క్రాప్ (Crop) ఫీచర్ గురించి వెల్లడించింది. స్మార్ట్ ఫోన్స్‌, ల్యాప్ టాప్, డెస్క్‌టాప్‌లో ఇమేజెస్‌ను ఇష్టం వచ్చిన రీతిలో క్రాప్‌ చేసుకొని సేవ్‌ చేసి షేర్‌ చేయాల్సి వస్తుంది. ఇకపై అలా కాకుండా నేరుగా వాట్సాప్‌లోనే ఫొటోలను క్రాప్‌ చేసుకునే వీలు కలుగనున్నది. అయితే, ఈ ఫీచర్‌ ఎలా పని చేయబోతున్నదనే విషయాన్ని WABetaInfo వివరించింది.

ఈ ఫీచర్‌ను ఎలా వాడాలంటే..?

వాట్సాప్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత మొదట క్రాప్ చేయాల్సిన ఫొటోను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత పైన ఇమేజ్‌లో చూపించిన మాదిరిగా ఫొటో పైభాగం కనిపించే ఐకాన్స్‌లో యారో మార్క్‌ చూపిస్తున్న క్రాప్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం ఫొటోను నచ్చిన విధంగా క్రాప్‌ చేసుకోవాలి. క్రాప్ చేసిన అనంతరం ఆ ఇమేజ్‌ను ఫార్వర్డ్ చేసుకోవచ్చు. దీంతో సమయం ఆదాకానున్నది. అంతేకాకుండా ఇమేజెస్‌ను క్రాప్‌ చేసుకునేందుకు మరో టూల్‌ను వినియోగించాల్సిన అవసరం లేదు. ఈ క్రాప్ ఆప్షన్ కొన్ని వాట్సాప్ బీటా టెస్టర్స్‌లో కనిపించిందని వాబీటాఇన్ఫో (WABetaInfo) పేర్కొంది. త్వరలోనే అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.