High Court: విషాదం.. హైకోర్టులో వాదనలు వినిపిస్తూ గుండెపోటుతో న్యాయవాది క‌న్నుమూత‌

  • By: sr    latest    Feb 18, 2025 4:39 PM IST
High Court: విషాదం.. హైకోర్టులో వాదనలు వినిపిస్తూ గుండెపోటుతో న్యాయవాది క‌న్నుమూత‌

తెలంగాణ హైకోర్టులో ఓ విషాద ఘ‌ట‌న జ‌రిగింది. న్యాయ‌స్థానంలో వాదనలు వినిపిస్తూ సీనియర్ న్యాయవాది పసునూరి వేణుగోపాల్ రావు కుప్పకూలి పోయారు. అక్క‌డ ఉన్న వారు వెంట‌నే ఆసుపత్రికి తరలించే లోపే వేణుగోపాల్ రావు మృతి చెందారు.

కాగా న్యాయవాది అక‌స్మిక‌ మృతికి సంతాపంగా విచారణలను నిలిపివేసిన జడ్జిలు.. అన్ని విచారణ లను రేపటికి వాయిదా వేస్తున్న‌ట్లు న్యాయమూర్తులు తెలిపారు.