కాంగ్రెస్‌ను మోసం చేసినోళ్లు రాజకీయంగా చావడం ఖాయం: రేవంత్ రెడ్డి
విధాత: మనుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలను ఓడించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చౌటుప్పల్ మండలంలో పర్యటించారు. ఆయన రాకతో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్‌లతో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. నియోజక వర్గ ఆడబిడ్డగా ఉన్న పాల్వాయ్ స్రవంతిని గెలిపించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండే స్రవంతికి పట్టగట్టాలన్నారు. డబ్బు సంచులతో […]

విధాత: మనుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలను ఓడించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చౌటుప్పల్ మండలంలో పర్యటించారు. ఆయన రాకతో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్‌లతో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. నియోజక వర్గ ఆడబిడ్డగా ఉన్న పాల్వాయ్ స్రవంతిని గెలిపించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండే స్రవంతికి పట్టగట్టాలన్నారు.
డబ్బు సంచులతో వచ్చే వారి మాటలు నమ్మి మోస పోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటుకు రూ0. 30 వేలు ఇస్తామని ఒకరు, రూ. 40 ఇస్తామని మరొకరు చిటికెలె కొడుతున్నారు. ఇవి ఎక్కడి నుంచి తెచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎవరి కొంపలు ముంచి తెస్తున్నారో మునుగోడు ప్రజలు ఆలోచన చేయాలన్నారు. మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు.
కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి గెలిపిస్తే అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ ని నిలదీసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం దొరుకుతుంది. దుబ్బాక, హుజురాబాద్‌లో బీజేపీ గెలిపించినా మన జీవితాల్లో మార్పు రాలేదన్నారు. మహిళలు అంటే కేసీఆర్‌కు చిన్నచూపు. తొలి ప్రభుత్వంలో ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వలేదు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క మహిళకూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. కానీ కేంద్రంలో నలుగురిని,, రాష్ట్రంలో ఐదుగురిని మంత్రులను ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు.
ఈ ఉప ఎన్నికతో మునుగోడుకు ఏమైనా నిధులు వచ్చాయా? అని ప్రశ్నించారు. అమ్ముడుపోయిన వాళ్లకు నిధులు మాత్రం ఫుల్‌గా వచ్చాయని రేవంత్ ఆరోపించారు.కాంగ్రెస్‌ను మోసం చేసి పోయినోళ్లు రాజకీయంగా చావడం ఖాయమన్నారు. అమ్ముడు పోయిన నేతలను ఆదరించవద్దని రేవంత్ కోరారు.