ముంచుకొస్తున్న మరో వైరస్‌..! మార్గ్‌బర్గ్‌తో తొమ్మిది మంది మృతి..! WHO అత్యవసర సమావేశం

Marburg Virus | కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. ఇటీవల పలు దేశాల్లో విజృంభించి వైరస్‌ తగ్గుముఖంపడుతున్నది. ఇదే సమయంలో మరో మహమ్మారి విరుచుకుపడుతున్నది. పశ్చిమ ఆఫ్రికా దేశంలో ‘మార్‌బర్గ్‌’ కేసులు నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఎబోలాను పోలి ఉండే ఈ వైరస్‌ హేమరేజిక్‌ జ్వరానికి కారణమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈక్వటోరియల్‌ గినియాలో పలువురికి వైరస్‌ పాజిటివ్‌గా గుర్తించినట్లు WHO […]

ముంచుకొస్తున్న మరో వైరస్‌..! మార్గ్‌బర్గ్‌తో తొమ్మిది మంది మృతి..! WHO అత్యవసర సమావేశం

Marburg Virus | కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. ఇటీవల పలు దేశాల్లో విజృంభించి వైరస్‌ తగ్గుముఖంపడుతున్నది. ఇదే సమయంలో మరో మహమ్మారి విరుచుకుపడుతున్నది. పశ్చిమ ఆఫ్రికా దేశంలో ‘మార్‌బర్గ్‌’ కేసులు నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఎబోలాను పోలి ఉండే ఈ వైరస్‌ హేమరేజిక్‌ జ్వరానికి కారణమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈక్వటోరియల్‌ గినియాలో పలువురికి వైరస్‌ పాజిటివ్‌గా గుర్తించినట్లు WHO తెలిపింది.

ఇప్పటి వరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. 16 అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కాంటాక్టులను గుర్తించడంతో పాటు, వైరస్‌ లక్షణాలను గుర్తించి ఐసోలేట్‌ చేసేందుకు ఆయా ప్రత్యేక బృందాలను మోహరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈక్వటోరియల్‌ గినియాలో గుర్తించిన మార్గ్‌బర్గ్‌ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేసింది. వైరస్‌ ప్రాణాంతకమని, ఇప్పటి వరకు దీనికి ఎలాంటి వ్యాక్సిన్‌ గానీ, మందులుగానీ లేవని తెలిపింది. వైరస్‌ సోకితే జ్వరం, అలసట, రక్తంతో వాంతులు, విరేచనాలు తదితర లక్షణాలు ఉంటాయని చెప్పింది.

వైరస్‌కు వేగంగా విస్తరించే సామర్థ్యం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతకు ముందు ప్రకటించింది. గాలి ద్వారా వ్యాపించదు కానీ.. వైరస్‌ సోకిన వారిని ముట్టుకోవడం, రక్తం, ఇతర శరీర ద్రవాల ద్వారా, రోగుల పడక, వస్త్రాలను ఇతరులు వినియోగించడం ద్వారా మార్‌బర్గ్ వైరస్ వ్యాపిస్తుందని పేర్కొంది. వైరస్ సోకిన జంతువులు, గబ్బిలాల నుంచి కూడా ఈ వైరస్ మనుషులకు సోకుతుందని హెచ్చరించింది. వైరస్ సోకిన వారిలో తీవ్రంగా జ్వరం, తలనొప్పి ఉంటుందని, శరీరంలో అంతర్గతంగా, బయటికి రక్త స్రావం జరుగుతుందని పేర్కొంది. వైరస్ లక్షణాలు ఒక్కసారిగా బయటపడతాయని, చికిత్స చేయడంలో ఏ మాత్రం జాప్యం జరిగినా ప్రాణాలకు ప్రమాదంగా పరిణమిస్తుందని చెప్పింది. మరణం రేటు 88శాతం వరకు ఉంటుంది. అయితే, ఇప్పటి వరకు టీకాలు, యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేవు.