మోదీని కాదని కేసీఆర్ వైపు వచ్చేదెవరు! అంత దమ్ము ఎవరికి ఉంది!!
విధాత: ఢిల్లీలో బీఆరెస్ జాతీయ పార్టీ కార్యాలయం ప్రారంభం, ఇతరత్రా కార్యకలాపాలు మొదలయ్యాయి. కానీ, కేసీఆర్ కు జాతీయ స్థాయిలో అనుకున్నంత మద్దతు దక్కినట్లు లేదు. ఏదో మొక్కుబడిగా అఖిలేష్ ఉత్తరప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి కుమార స్వామి మినహా పెద్దగా ఎవరూ కలిసి వచ్చినట్లు లేదు. నిత్యం మోదీని తిట్టే అరవింద్ క్రేజీవాల్, మమతా బెనర్జీ వంటివాళ్లు సైతం కేసీఆర్ కు మద్దతు పలకలేదు. మోడీతో తగాదా అంటే జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు సీబీఐ, […]

విధాత: ఢిల్లీలో బీఆరెస్ జాతీయ పార్టీ కార్యాలయం ప్రారంభం, ఇతరత్రా కార్యకలాపాలు మొదలయ్యాయి. కానీ, కేసీఆర్ కు జాతీయ స్థాయిలో అనుకున్నంత మద్దతు దక్కినట్లు లేదు. ఏదో మొక్కుబడిగా అఖిలేష్ ఉత్తరప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి కుమార స్వామి మినహా పెద్దగా ఎవరూ కలిసి వచ్చినట్లు లేదు. నిత్యం మోదీని తిట్టే అరవింద్ క్రేజీవాల్, మమతా బెనర్జీ వంటివాళ్లు సైతం కేసీఆర్ కు మద్దతు పలకలేదు.
మోడీతో తగాదా అంటే జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖల వంటి అధికారులను బొట్టు బెట్టి మరీ దాడులకు పిలుచుకున్నట్లు అవుతుంది. ఇప్పటికే వైరి పక్షాల మీదకు ఆ సంస్థలు ఎలా విరుచుకుపడుతున్నాయో స్పష్టంగా తెలుస్తోంది ఇక ఇప్పుడు కేసీఆర్ పక్కన నిలబడితే ఇక మున్ముందు ఏమి జరుగుతుందో అందరికి తెలిసిందే..
అందుకే ఈ తలనొప్పి యవ్వారం ఎందుకులే అని ఆ నాయకులంతా బీఆరెస్ ను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ వంటివాళ్ళు నిత్యం మోదీని వ్యతిరేకిస్తుంటారు. మరి ఇలా కేసీఆర్ మాదిరిగా ప్రత్యేక శిబిరం పెట్టి యుద్ధానికి సిద్ధం అయినపుడు కూడా వారంతా ఎందుకు రాలేదు.. ఎందుకు మద్దతు పలకడం లేదు. దీనికి రెండుకారణాలు ఉండొచ్చు.
మొదటిది వారంతా తెలంగాణ కన్నా పెద్ద రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు, వారి ఎంపీల సంఖ్యాబలం కూడా ఎక్కువ. మరి అంత బలాన్ని తమవద్ద ఉంచుకుని కేవలం 17 మంది ఎంపిలున్న తెలంగాణ ముఖ్యమంత్రిని ఎందుకు సపోర్ట్ చేస్తారు.. ఇంకో కారణం ఏమంటే జాతీయ స్థాయిలో దక్షిణాది నాయకులకు ఎప్పుడూ విలువ, ప్రయార్టీ తక్కువే. ఏదన్నా లీడ్ చేస్తే మేమే చేయాలి తప్ప ఓ దక్షిణాది చిన్న రాష్ట్రపు సీఎం వెంట ఎందుకు నడవాలన్నది వారి తత్వం. ఈ కారణంతోనూ వారు మద్దతు ఇవ్వకపోయి ఉండొచ్చు.
ఇంకా ముఖ్యమైనది జాతీయ స్థాయిలో మోడీ ప్రభ ఇంకొన్నాళ్లు వెలిగేలా ఉంది. ఇలాంటప్పుడు ఎంతమంది చేతులు కలిపినా మోదీని ఎదుర్కోవడం కష్టమే. ఈ లాజిక్ తెలిసిన లీడర్లు ఎలాగూ మోదీని నిలువరించలేనపుడు అనవసరంగా శత్రుత్వం పెంచుకోవడం ఎందుకులే అని వ్యూహాత్మకంగా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఢిల్లీలో దుమ్ము లేపుదామనుకున్న కేసీఆర్ కు అక్కడ అనుకున్నంత మద్దతు దక్కలేదన్నది మాత్రం సుస్పష్టం.