Taapsee | తాప్సీని మోసం చేసిన.. ఆ స్టార్ హీరో కొడుకు ఎవరు?
Taapsee విధాత: అందం, అందానికి తగిన హావభావాలను పలికించగలిగే నటన ఉంటే సీనీ పరిశ్రమలో ఓ వెలుగు వెలగచ్చు. తమ కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని సినీ లోకంలో వెలిగిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అయితే నటించిన సినిమాలు తక్కువే అయినా గుర్తుండిపోయే పాత్రలు చేసిన హీరోయిన్లు మాత్రం తక్కువే ఉంటారు. ఆ వరుసలో తాప్సీ మొదటి స్థానంలో ఉంటుంది. ‘ఝుమ్మంది నాదం, మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, గుండెల్లో గోదారి, ఘాజి’ సినిమాలతో మంచి పేరే […]

Taapsee
విధాత: అందం, అందానికి తగిన హావభావాలను పలికించగలిగే నటన ఉంటే సీనీ పరిశ్రమలో ఓ వెలుగు వెలగచ్చు. తమ కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని సినీ లోకంలో వెలిగిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అయితే నటించిన సినిమాలు తక్కువే అయినా గుర్తుండిపోయే పాత్రలు చేసిన హీరోయిన్లు మాత్రం తక్కువే ఉంటారు.
ఆ వరుసలో తాప్సీ మొదటి స్థానంలో ఉంటుంది. ‘ఝుమ్మంది నాదం, మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, గుండెల్లో గోదారి, ఘాజి’ సినిమాలతో మంచి పేరే తెచ్చుకుంది. అలాగే హిందీలోనూ మంచి పాత్రలు చేస్తూ వస్తుంది. అయితే తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ తర్వాత ఆమె మరో సినిమా ఒప్పుకున్న ధాఖలాలు లేవు.
హీరోయిన్‌గా మంచి టాలెంట్ ఉండి, పరిచయాలు ఉండి కూడా తాప్సీ తెలుగులో నటించకపోవడానికి వ్యక్తిగత కారణాలు కూడా కారణమనే ప్రచారం కాస్త గట్టిగానే సాగుతుంది. ఎంత అందం, తెలివితేటలున్నా కూడా హీరోయిన్లు ఒకరిచేతిలో మోసపోవడం అనేది కాస్త విచిత్రంగానే ఉంటుంది. ఎంత సంపాదించినా, పేరు ప్రఖ్యాతలున్నా సినీ ప్రేమలు తాత్కాలికమే అని మరోసారి రుజువైంది. అసలు సంగతేంటంటే..
తాప్సీ గురించి చెప్పాలంటే విలక్షణమైన పాత్రలు చేస్తూ అటు బాలీవుడ్‌లో నటిగా బిజీగా ఉంది. అయితే ప్రత్యేకించి టాలీవుడ్‌కి దూరంగా ఉండటానికి ఓ రీజన్ కూడా ఉందట. దీనికి ఓ స్టార్ హీరో కొడుకు అనే ప్రచారం కూడా జోరుగానే జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ప్రేమలోకి దింపి, ఫుల్ ఎంజాయ్ చేశాడట. తర్వాత అతగాడు తాప్సీ ఎవరో తెలీనట్టు వ్యవహరించి వదిలించుకున్నాడట.
ఆ మోసం తట్టుకోలేకే తను టాలీవుడ్‌లో నటించడమే మానుకుందట. ఇప్పుడీ విషయం సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. ఇంతకీ టాలీవుడ్‌లో తాప్సీని మోసం చేసిన ఆ స్టార్ హీరో కొడుకు ఎవరో? ఇది కూడా తాప్సీనే చెబితే బాగుంటుంది.. లేదంటే ఓ ఇద్దరు ముగ్గురు హీరోలను అనవసరంగా నెటిజన్లు ఆడిపోసుకుంటారు. మరి ఆ విషయం తాప్సీ చెబుతుందంటారా?