జేఎన్.1 వేరియంట్‌తో జాగ్రత్తలు తీసుకోవాలి.. హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..!
మళ్లీ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్నది. గత కొన్నివారాలుగా పలుదేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. భారత్‌లోనూ కొత్త కేసులు పెరుగుతున్నాయి

WHO | మళ్లీ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్నది. గత కొన్నివారాలుగా పలుదేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. భారత్‌లోనూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే మహమ్మారి మూడు వేవ్‌లో విరుచుకుపడగా జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ వైరస్ విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెండే వేరియంట్‌లో ప్రభావం చూపిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు కేరళలో నమోదైంది.
అయితే, ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వేరియంట్ ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. జేఎన్.1 వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా వర్గీకరించింది. అయితే, వైరస్‌తో పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదని పేర్కొంది. సబ్ వేరియంట్లతో ముప్పు తక్కువగనే ఉందని చెప్పింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ప్రాణాపాయం నుంచి రక్షణ కల్పిస్తాయని చెప్పింది.
ప్రస్తుతం శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కోవిడ్-19, జేఎన్.1 సబ్ వేరియంట్ ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. భారత్‌లో జేఎన్. సబ్ వేరియంట్ కేసు కేరళలో నమోదవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఇన్‌ఫ్లుఎంజాలాంటి వ్యాధులను పర్యవేక్షించి.. నివేదికను ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఎప్పటికప్పుడు కొవిడ్ పాజిటివ్ కేసులకు సంబంధించిన నమూనాలను పంపాలని సూచించింది.