ఇంతకీ బాలయ్య ముచ్చట పడుతున్న చెంఘీజ్ ఖాన్ ఎవరు?
విధాత: తెలుగులో టాప్ హీరోలలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణల పేర్లు చెప్పుకోవాలి. వారిద్దరూ తెలుగునాట దాదాపు సరిసమానమైన ఫాలోయింగ్‌ను కలిగిన స్టార్లు, వీరిద్దరూ సమకాలికులుగా చెప్పుకోవాలి. ఇద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సామాన్యం కాదు. చాలా కాలం కిందట చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటించడం తన జీవితాశయం అని చెప్పాడు, దానికి తగ్గట్టుగానే ఇటీవల ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఇక అదే సమయంలో […]

విధాత: తెలుగులో టాప్ హీరోలలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణల పేర్లు చెప్పుకోవాలి. వారిద్దరూ తెలుగునాట దాదాపు సరిసమానమైన ఫాలోయింగ్‌ను కలిగిన స్టార్లు, వీరిద్దరూ సమకాలికులుగా చెప్పుకోవాలి. ఇద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సామాన్యం కాదు.
చాలా కాలం కిందట చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటించడం తన జీవితాశయం అని చెప్పాడు, దానికి తగ్గట్టుగానే ఇటీవల ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి చిత్రం చేసిన సంగతి తెలిసిందే.
ఇక అదే సమయంలో బాలకృష్ణ కూడా చెంఘీజ్ ఖాన్‌గా నటించడం తన జీవితాశయం అని ఎప్పుడో ప్రకటించాడు. తాజాగా ఒంగోలులో జరిగిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోసారి బాలయ్య ఈ విషయం ప్రకటించాడు.
చెంఘీజ్ ఖాన్ కచ్చితంగా చేస్తా.. అది నా జీవితాశయం.. కానీ టైం రావాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు బాలయ్య. ఇక ఇదే వేడుకలో అనిల్ రావిపూడి కూడా మంగోలియన్ అన్నాడు. అంటే బహుశా అనిల్ రావిపూడితో బాలయ్య చిత్రం chengiz khan అయి ఉంటుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. కానీ అనిల్ రావిపూడి నుంచి పటాస్, ఎఫ్ 2 వంటి చిత్రాలను ఆశించవచ్చు.
chengiz khan వంటి ఓ చారిత్రాత్మక కథను అనిల్ రావిపూడి హ్యాండిల్ చేయగలడా? అనేది అనుమానమే. ఇక ఇదే వేదికపై బాలయ్యతో 4 బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన సీనియర్ దర్శకుడు బి. గోపాల్ కూడా ఉన్నాడు. ఆయన ఎప్పటినుంచో బాలయ్యతో ఓ చిత్రం చేయాలనుకుంటున్నాడు. మరి బాలయ్య ఏమైనా బి.గోపాల్‌కు chengiz khan బాధ్యతలు అప్పగిస్తాడా అనే అనుమానం వస్తుంది.
అయితే చాలామంది మాత్రం chengiz khan వంటి చిత్రాన్ని రాజమౌళి, క్రిష్ వంటి వారు మాత్రమే తగిన న్యాయం చేయగలరని సూచిస్తున్నారు. మరోవైపు బాలయ్య.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార అనే సోషియో ఫాంటసీ చిత్రాన్ని తీసి ఏకంగా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అతిపెద్ద హిట్టు ఇచ్చిన దర్శకుడు వశిష్ట్‌కు ఈ అవకాశం వస్తుందని మరికొందరు భావిస్తున్నారు.
ఎందుకంటే తాజాగా బాలయ్య వశిష్టతో కూడా ఓ చిత్రాన్ని చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య చెంఘీజ్ ఖాన్ చిత్రాన్ని చేస్తానని చెప్పినప్పటి నుంచి పలువురు ఈ చెంఘీజ్ ఖాన్ గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. అసలు ఎవరీ చెంఘీజ్ ఖాన్ అనే అనుమానాలు వస్తున్నాయి.
చాలా మందికి ఈ చెంఘీజ్ ఖాన్ గురించి తెలియదు. దాంతో వారందరూ గూగుల్ తల్లిని ఆశ్రయిస్తూ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మంగోలియన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి చెంఘీజ్ ఖాన్. ఆయన ఎన్నో సంచార జాతులను ఒకటిగా చేసి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
చిన్నచిన్న రాజులను తన సామంతులుగా చేసుకొని తన మంగోలియన్ సామ్రాజ్యంలో కలిపి వేసుకున్నాడు. తన సామ్రాజ్య విస్తరణకు ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆయన జీవితమంతా యుద్ధాలు, పోరాటాలతోనే సాగింది. ఈయన అసలు పేరు టెమూజిన్. చరిత్ర చెబుతున్న సమాచారం ప్రకారం ఏదైనా సామ్రాజ్యంపై చెంఘీజ్ ఖాన్ సేన దండయాత్ర చేస్తే వారు అక్కడి ప్రజలను నానా హింసలకు గురి చేసేవారు.
స్త్రీలను హింసించేవారు. వారిపై ఎంతో క్రూరత్వం చూపించేవారు. మహిళలను ఎత్తుకొని వెళ్లేవారు. అతను, అతని సైన్యం చేసే అఘాయిత్యాలు, క్రూరత్వం భరించలేక ఎంతోమంది రాజులు తమ సామ్రాజ్యాన్ని మంగోలియన్ సామ్రాజ్యంలో కలిపి వేసి ఆయనకు సామంతులుగా మారారు. ఇన్ని చేసినా కూడా మంగోలియాలకు ఆయన దైవంతో సమానం.
యుద్ధతంత్ర నీతిలో ఆయనను మించిన చాణుక్యుడు కూడా లేడని ప్రశస్తి. వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నడంలో, యుద్ధ రీతిని అనుసరించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఈ విషయంలో ఆయనను మించిన ధీరుడు లేడని మంగోలియన్లు భావిస్తారు. ఎంత బలవంతులైనా.. ఎంత పెద్ద సైన్యం ఉన్నప్పటికీ తనదైన వ్యూహరచనతో ఆయన వారిని కకావికలు చేసేవాడు.
వాస్తవానికి ఛంఘీజ్ ఖాన్‌లో కథానాయకుడు కంటే ప్రతి కథానాయకుడు ఛాయలు ఎక్కువగా ఉంటాయి. ఆయన చేసే పనులు చూస్తే ఎక్కువమంది దృష్టిలో ఆయన ఒక విలన్. మరి బాలయ్య చెంఘీజ్ ఖాన్‌గా నటిస్తే అతడిని విలన్ ఛాయల్లో చూపిస్తారా? లేక హీరోగా ఎలివేట్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.