♦ కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తారా?
♦ అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారు?
♦ డబ్బులే లేని స్థితిలో గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారు?
♦ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు.అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు.అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ‘వచ్చే మార్చి, ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముంది.
ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమంటే డ్రామాలాడటమే’ అని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లికి వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. 6 గ్యారంటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలు చేస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో, గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఒక్కో వ్యక్తిపై లక్షన్నర రూపాయల అప్పు భారం మోపారు. వాటినెలా తీరుస్తారు? కొత్త హామీలను ఎలా తీరుస్తారోననే ఆందోళనలో ప్రజలున్నారని అన్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. గత 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, రేషన్ కార్డు ప్రాతిపదికగా 6 గ్యారంటీలను అమలు చేస్తామంటే పేదలకు న్యాయం జరిగే అవకాశం లేదన్నారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. కేంద్రంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్ని సర్వే సంస్థలు తేల్చి చెబుతున్నాయన్నారు. కేంద్రం నుండి అదనపు నిధులు తీసుకురావాలంటే రాష్ట్రం నుండి అత్యధిక మంది ఎంపీలను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని మొత్తుకున్నా గత ప్రభుత్వం నుండి స్పందన లేదన్నారు. ఈరోజు ఉపాధ్యాయులే స్కూళ్లలో టాయిలెట్లు కడిగే దుస్థితి కన్పిస్తోందన్నారు. ‘భారత్ ను, ప్రధాని మోదీని దూషిస్తే… ఫలితాలు ఎట్లుంటాయో మాల్దివుల ప్రభుత్వానికి రుచి చూపించిన భారతీయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హిందూ ధర్మరక్షణ, దేశ రక్షణ, దేశ ఐక్యత విషయంలో ఇదే పంథాను కొనసాగించాలని ఆయన కోరారు.