Nara Rohit | కలెక్షన్ కింగ్ లాంటి కంఠం.. అయినా ఈ హీరో కామ్‌గా ఉంటున్నాడేంటో?

Nara Rohit | కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అంటూ మోహన్ బాబుని పిలుస్తుంటారు. డైలాగ్ చెప్పడంలో అన్న ఎన్టీఆర్ తర్వాత నేనే.. నా అంతటివాడు ఇంకొకడు లేనే లేడు అని.. లెజెంట్ ఏఎన్నార్, మెగాస్టార్ చిరంజీవి వంటి వారి ముందు మోహన్ బాబు ఓ సందర్భంలో గర్వంగా ప్రకటించుకున్నాడు. మోహన్ బాబు మాటకారితనం గురించి అందరికీ తెలిసిందేలే కానీ.. ఇప్పుడలాంటి డైలాగ్ డెలివరీ ఇవ్వగల సమర్థత ఉన్న నటుడిగా పేరొందాడు నారా రోహిత్. కాగా.. ఆయన […]

Nara Rohit | కలెక్షన్ కింగ్ లాంటి కంఠం.. అయినా ఈ హీరో కామ్‌గా ఉంటున్నాడేంటో?

Nara Rohit |

కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అంటూ మోహన్ బాబుని పిలుస్తుంటారు. డైలాగ్ చెప్పడంలో అన్న ఎన్టీఆర్ తర్వాత నేనే.. నా అంతటివాడు ఇంకొకడు లేనే లేడు అని.. లెజెంట్ ఏఎన్నార్, మెగాస్టార్ చిరంజీవి వంటి వారి ముందు మోహన్ బాబు ఓ సందర్భంలో గర్వంగా ప్రకటించుకున్నాడు. మోహన్ బాబు మాటకారితనం గురించి అందరికీ తెలిసిందేలే కానీ.. ఇప్పుడలాంటి డైలాగ్ డెలివరీ ఇవ్వగల సమర్థత ఉన్న నటుడిగా పేరొందాడు నారా రోహిత్.

కాగా.. ఆయన ఎన్నుకునే సినిమాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో తెలియంది కాదు. మొదటి సినిమా నుంచి.. ప్రతి సినిమాకు ఏదో ఒక వైవిధ్యతను కనబరుస్తూ.. తనకంటూ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ బుక్‌లో ఓ పేజీ క్రియేట్ చేసుకున్నాడు. మరి ఏమైందో ఏమో కానీ.. కొన్నాళ్లుగా నారా రోహిత్ సినిమాలేవీ రావడం లేదు. అసలాయన షూటింగ్‌లో పాల్గొంటున్న దాఖలాలు కూడా లేవు. కామ్‌గా ఉంటున్నాడు.

ఈ మధ్య లావై.. భారీ ఆకారంతో కనిపించిన నారా రోహిత్.. ఆ ఆకారాన్ని మార్చుకునే పనిలో ఉన్నాడనేలా వార్తలైతే వస్తూనే ఉన్నాయి. ఎందుకలా ఒక్కసారే లావుపోయాడనేది తెలియదుకానీ.. ఆయన చివరిగా చేసిన ‘వీర భోగ వసంత రాయలు’ సినిమాలో కూడా అంత భారీగా ఏం కనబడలేదు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా లావై పోయి.. నడవడమే కష్టం అన్నట్లుగా మారిపోయాడు.

ఇప్పుడా కొవ్వు కరిగించే పనిలో ఉన్న నారా రోహిత్.. అందులో సక్సెస్ అయ్యాడనే అనిపిస్తోంది. తాజాగా ఆయన హీరోగా ఓ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. లుక్ అయితే రివీల్ చేయలేదు కానీ.. సినిమా అనౌన్స్ చేశాడు కాబట్టి.. మ్యాగ్జిమమ్ కొవ్వు కరిగించే ఉంటాడని అంతా అనుకుంటున్నారు.

బాణం, సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు వంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ఎంచుకొని ప్రేక్షకుల గుర్తింపు, అభిమానం పొందిన నారా రోహిత్ తన కమ్‌బ్యాక్ ఫిల్మ్ వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో చేసే సినిమాతో ఇవ్వబోతున్నాడు. నారారోహిత్ 19వ చిత్రంగా తెరకెక్కబోతోన్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ లుక్ తప్ప ఇతర వివరాలేవీ వెల్లడించలేదు.

ఈ ప్రీ లుక్‌లో ‘One man will stand again, against all odd’ అనే కొటేషన్‌తో పాటు ప్రముఖ తెలుగు దినపత్రికల నుంచి వివిధ ఆర్టికల్స్ వున్న నెంబర్ 2ని కూడా గమనించవచ్చు. ప్రీ లుక్ పోస్టర్ చూస్తుంటే మరో వైవిధ్యమైన చిత్రంతోనే తన కమ్ బ్యాక్ ఉండబోతుందనేది అర్థమవుతోంది.

అయితే ఈ సినిమా కంటే ముందు ‘పండగల వచ్చాడు’, ‘అనగనగా దక్షిణాదిలో’, ‘శబ్ధం’, ‘మద్రాసి’ వంటి సినిమాలను నారా రోహిత్ అనౌన్స్ చేశారు. వీటిలో రెండు మూడు సినిమాలు కొంత వరకు షూటింగ్ కూడా జరుపుకున్నాయి. ఇప్పుడు వచ్చిన అనౌన్స్‌మెంట్ చిత్రం నారా రోహిత్19 అంటున్నారంటే.. ఈ నాలుగు సినిమాలు హోల్డ్‌లో ఉన్నాయో.. లేదంటే పూర్తిగా ఆగిపోయాయో తెలియాల్సి ఉంది. ఏదైతేనేం.. మంచి నటుడు మళ్లీ కమ్‌బ్యాక్ అవడమనేది మాత్రం ఆయన ఫ్యాన్స్‌కు ఆనందాన్నిస్తోంది.