Uttar Pradesh | ప్రేమికుల రోజున ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. సినిమా తరహాలో నా కోసం ప్రాణాలిస్తావా అని ఓ భర్త తన భార్యను అడిగాడు. ఇస్తాను అని చెప్పగానే.. ఆమె గొంతు నులిమి చంపాడు భర్త. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో వెలుగు చూసింది. పదరత్పూర్ గ్రామానికి చెందిన ఫరూక్ అనే వ్యక్తి డాక్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే భార్య నస్రీన్‌ను ప్రేమికుల రోజున తన మాటలతో ముంచెత్తాడు. నా కోసం ప్రాణాలిస్తావా […]
Uttar Pradesh | ప్రేమికుల రోజున ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. సినిమా తరహాలో నా కోసం ప్రాణాలిస్తావా అని ఓ భర్త తన భార్యను అడిగాడు. ఇస్తాను అని చెప్పగానే.. ఆమె గొంతు నులిమి చంపాడు భర్త. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో వెలుగు చూసింది.
పదరత్పూర్ గ్రామానికి చెందిన ఫరూక్ అనే వ్యక్తి డాక్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే భార్య నస్రీన్‌ను ప్రేమికుల రోజున తన మాటలతో ముంచెత్తాడు. నా కోసం ప్రాణాలిస్తావా అంటూ సినిమా డైలాగులు కొట్టాడు. ఆమె కూడా ఇస్తాను అని చెప్పింది. దీంతో నస్రీన్ గొంతు నులిమి చంపేశాడు ఫరూక్. అనంతరం నగదు, ఆభరణాలతో పరారీ అయ్యాడు.
ఫరూక్ తన మరదలితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే వీరి ప్రేమకు నస్రీన్ అడ్డుగా ఉంది. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ఫరూక్ ప్లాన్ చేశాడు. లవర్స్ డే రోజున నస్రీన్ చంపేశాడు. ఈ కేసులో ఫరూక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించాడు. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించారు.