ఎయిమ్స్ అభివృద్ధిని వేగవంతం చేస్తాం: కేంద్ర మంత్రి మాండవియా
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సందర్శన విధాత: బీబీనగర్ ఎయిమ్స్ లో అవసరమైన మౌలిక వసతుల కల్పన వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ మంత్రి మాన్సుక్ మాండవియా అన్నారు. ఆదివారం అయన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఎయిమ్స్ లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఈ-సంజీవిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాండవియా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు వైద్య పరంగా కీలకంగా ఉన్న ఎయిమ్స్ వైద్య కళాశాల […]

- ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సందర్శన
విధాత: బీబీనగర్ ఎయిమ్స్ లో అవసరమైన మౌలిక వసతుల కల్పన వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ మంత్రి మాన్సుక్ మాండవియా అన్నారు. ఆదివారం అయన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఎయిమ్స్ లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఈ-సంజీవిని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాండవియా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు వైద్య పరంగా కీలకంగా ఉన్న ఎయిమ్స్ వైద్య కళాశాల ఆసుపత్రి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. వైద్యులు, వైద్య విద్యార్థులు ఎయిమ్స్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆంకితభావంతో కృషి చేయాలన్నారు.
కోవిడ్ సంక్షోభంలో భారత ప్రభుత్వం ప్రపంచంలో నే మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందించిందన్నారు దేశంలో వైద్య రంగాన్ని ఆసుపత్రి స్థాయి నుండి రోగి వరకు డిజిటలైజేషన్ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. భారత్ లో వైద్యరంగ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, 10 లక్షల మంది వైద్యుల స్థాయి నుండి కోటి మంది వైద్యుల తయారీ దిశగా వైద్య విద్యను అభివృద్ధి చేస్తుందన్నారు.
ఆసుపత్రులను ఆలయాలుగా వైద్యులను దేవుళ్ళుగా భావించే నాగరికత ఉన్న దేశంలో రోగులకు ఆ దిశగా నమ్మకం పెంపొందించేలా వైద్య సేవలు అందించాలన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కోరిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చి ఎయిమ్స్ అభివృద్ధికి నిధుల మంజూరుకు అంగీకరించిన కేంద్ర మంత్రి మాండవియాకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తెలంగాణ జిల్లాలకు మెరుగైన వైద్యం అందించే దిశగా ఎయిమ్స్ ప్రాధాన్యతను వివరించి వెంటనే పూర్తిస్థాయిలో ఎయిమ్స్ అందుబాటులో వచ్చేలా అన్ని వసతులు కల్పించాలని కోరడం జరిగిందన్నారు.
ఈ నెలలో గాని, వచ్చే నెలలో గాని ప్రధాని మోడీ ఎయిమ్స్ ని సందర్శించే అవకాశం ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ సేవలు ఎయిమ్స్ లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
ఎయిమ్స్ నిర్మాణంతో తెలుగు వైద్య విద్యార్థులకు ఇక్కడ విద్యాభ్యాసం కోసం అవకాశం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఎయిమ్స్ డీన్ డాక్టర్ రాహుల్ నారంగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియా తదితరులు పాల్గొన్నారు.