Windows 10 | విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు మైక్రోసాఫ్ట్‌ మంగళం..! అప్‌డేట్స్‌ నిలిపివేసిన కంపెనీ..!

Windows 10 | టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను నిలిపివేయనున్నది. ఈ విషయాన్ని కంపెనీ బ్లాగ్‌ పోస్ట్‌లో ప్రకటించింది. ఇకపై విండోస్‌ 10 మేజర్‌ స్టాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను విడుదల చేయబోమని, విండోస్‌ చివరి అప్‌డేట్‌ 22H2 అవుతుందని, ఇటీవలే విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది. 2025 నాటికి విండోస్ షట్‌డౌన్‌.. విండోస్‌-10 22H2 తన చివరి ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ అని కంపెనీ తెలిపింది. కంపెనీ ఇకపై దాని కోసం ఎలాంటి ప్రధాన అప్‌డేట్‌ […]

  • Publish Date - May 1, 2023 / 02:58 AM IST

Windows 10 | టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను నిలిపివేయనున్నది. ఈ విషయాన్ని కంపెనీ బ్లాగ్‌ పోస్ట్‌లో ప్రకటించింది. ఇకపై విండోస్‌ 10 మేజర్‌ స్టాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను విడుదల చేయబోమని, విండోస్‌ చివరి అప్‌డేట్‌ 22H2 అవుతుందని, ఇటీవలే విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది.

2025 నాటికి విండోస్ షట్‌డౌన్‌..

విండోస్‌-10 22H2 తన చివరి ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ అని కంపెనీ తెలిపింది. కంపెనీ ఇకపై దాని కోసం ఎలాంటి ప్రధాన అప్‌డేట్‌ విడుదల చేయదని పేర్కొంది. కానీ, అక్టోబర్ 14, 2025 వరకు విండోస్‌-10 డివైజెస్‌కు సెక్యూరిటీ, బగ్‌ ఫిక్స్‌ అప్‌డేట్స్‌ కొనసాగుతుంటాయని పేర్కొంది. ఇప్పటికే ఉన్న లాంగ్-టర్మ్ సర్వీసింగ్ ఛానెల్ లేదంటే ఎల్‌టీఎస్‌సీ సపోర్ట్ తేదీ వరకు అప్‌డేట్స్‌ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.

Windows 11కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు

కొత్త విండోస్‌ 10 ఫీచర్‌ అప్‌డేట్‌లు ఏవీ రానందున.. విండోస్‌-11కి అప్‌గ్రేడ్ చేయమని మైక్రోసాఫ్ట్‌ సిఫారసు చేయనున్నది. అయితే, కానీ సపోర్ట్‌ తేదీ ముగిసిన విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కొనసాగించుకోవచ్చు. కానీ, ఆ సమయం తర్వాత మీరు అదనపు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను నిలిపి వేయనుండడంతో సెక్యూరిటీపరంగా ఇబ్బందికరంగా మారనున్నది.

విండోస్‌ 10 ప్లేస్‌లో విండోస్‌ 11 అప్‌డేట్‌ చేసుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌-11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అక్టోబర్‌ 2021లో విడుదల చేసింది. గతేడాది మేలో విండోస్‌ 7 ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ వాడుతున్న వారందరు విండోస్‌-11 అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. విండోస్‌-11లో డిజైన్‌, ఇంటర్‌ఫేస్‌, స్టార్ట్‌ మెనూలోనూ భారీగా మార్పులు చేసింది.

Windows 11ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి

Microsoft Windows 11 అప్‌డేట్‌ను Windows 10 వినియోగదారులకు విడుదల చేసింది. మీరు సిస్టమ్ అప్‌డేట్స్‌లోకి వెళ్లి చెక్‌చేసుకోవచ్చు. కొత్త విండోస్‌తో మీరు మైక్రోసాఫ్ట్ PC హెల్త్ యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సిస్టమ్ అప్‌డేట్‌లో డౌన్‌లోడ్ నౌ బటన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత గైడ్‌లైన్స్‌ దశలను అనుసరిస్తూ.. మీ కంప్యూటర్‌లో Windows 11ని డౌన్‌లోడ్ అవుతుంది.

Latest News