Peacock Attack । నెమలి గుడ్లు కొట్టేసిన మహిళ.. ఆ నెమలి ఏం చేసిందంటే..
Peacock Attack | విధాత: మన చిన్నపిల్లలను ఎవరైనా ఏమైనా చేస్తే మనం ఊరుకోం కదా! జంతువులు, పక్షులు కూడా అంతే మరి! ఒక నెమలి చెట్టుపై గూడులో పెట్టుకున్న గుడ్లను దొంగిలించేందుకు ప్రయత్నించినవారిపై ఒక్కసారిగా దాడి చేసి.. పెద్ద గుణపాఠమే నేర్పింది. మళ్లీ నాతో పెట్టుకున్నారో.. అంటూ వార్నింగ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు మహిళలు చెట్టుపై ఒక నెమలి పెట్టుకున్న గుడ్లను చూశారు. నెమలి గుడ్లతో ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుందని అనుకున్నారేమో.. ఒకరు చెట్టు […]

Peacock Attack |
విధాత: మన చిన్నపిల్లలను ఎవరైనా ఏమైనా చేస్తే మనం ఊరుకోం కదా! జంతువులు, పక్షులు కూడా అంతే మరి! ఒక నెమలి చెట్టుపై గూడులో పెట్టుకున్న గుడ్లను దొంగిలించేందుకు ప్రయత్నించినవారిపై ఒక్కసారిగా దాడి చేసి.. పెద్ద గుణపాఠమే నేర్పింది. మళ్లీ నాతో పెట్టుకున్నారో.. అంటూ వార్నింగ్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఇద్దరు మహిళలు చెట్టుపై ఒక నెమలి పెట్టుకున్న గుడ్లను చూశారు. నెమలి గుడ్లతో ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుందని అనుకున్నారేమో.. ఒకరు చెట్టు ఎక్కి ఒక్కొక్క గుడ్డును తీసి ఇస్తుంటే.. తన ఫ్రాక్‌ను పట్టుకుని గుడ్లు కిందపడిపోకుండా మరొక మహిళ నిలబడింది. ఎక్కడి నుంచి చూసిందో ఆ నెమలి.. వెంటనే ఎగురుకుంటూ ఆ చెట్టుపైన ఉన్న మహిళపై దాడి (Peacock Attack) చేసింది.
నెమలి గుడ్లు కొట్టేసిన మహిళ.. ఆ నెమలి ఏం చేసిందంటే.. https://t.co/3Ly5TsBF6t pic.twitter.com/mE3LigGVpt
— vidhaathanews (@vidhaathanews) April 18, 2023
అక్కడితో ఆగకుండా.. కింద ఉన్న మహిళను కిందపడేసి.. మరీ తన కాళ్లతో రక్కేసింది. దెబ్బకు వాళ్లిద్దరూ అక్కడి నుంచి పరుగు లంకించుకున్నారు. గుడ్లు దొంగిలించేందుకు ప్రయత్నించినవారిపై నెమలి దాడి చేయడాన్ని అనేక మంది మెచ్చుకుంటూ కామెంట్లు పెట్టారు. కొందరేమో ఇది డ్రామా అంటూ కొట్టిపారేశారు. ఏది ఏమైనా ఆ వీడియో మాత్రం భారీ స్థాయిలో లైకులు అందుకుంటున్నది.
View this post on Instagram