బ‌ట్ట‌లు చిరిగేలా ఆటో డ్రైవర్‌ను కొట్టిన మ‌హిళ‌లు.. వీడియో

విధాత,రాయ్‌పూర్: ఓ ఆటో డ్రైవ‌ర్‌ను కొంత మంది మ‌హిళ‌లు బ‌ట్ట‌లు చిరిగేలా చిత‌క్కొట్టారు. ఈ దారుణ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఇంట‌ర్నేష‌న్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఎయిర్‌పోర్టులో రాహుల్ ట్రావెల్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో దినేశ్ అనే వ్య‌క్తి ఆటో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే గ‌త మే, జూన్ నెల జీతాల‌ను దినేశ్‌కు ఇవ్వ‌లేదు. దీంతో త‌న జీతం కోసం రాహుల్ ట్రావెల్స్ కంపెనీకి ఆదివారం […]

  • By: krs    latest    Sep 19, 2022 1:10 PM IST
బ‌ట్ట‌లు చిరిగేలా ఆటో డ్రైవర్‌ను కొట్టిన మ‌హిళ‌లు.. వీడియో

విధాత,రాయ్‌పూర్: ఓ ఆటో డ్రైవ‌ర్‌ను కొంత మంది మ‌హిళ‌లు బ‌ట్ట‌లు చిరిగేలా చిత‌క్కొట్టారు. ఈ దారుణ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఇంట‌ర్నేష‌న్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే..

ఎయిర్‌పోర్టులో రాహుల్ ట్రావెల్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో దినేశ్ అనే వ్య‌క్తి ఆటో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే గ‌త మే, జూన్ నెల జీతాల‌ను దినేశ్‌కు ఇవ్వ‌లేదు. దీంతో త‌న జీతం కోసం రాహుల్ ట్రావెల్స్ కంపెనీకి ఆదివారం వ‌చ్చాడు.

మేనేజ‌ర్ నంబ‌ర్ ఇవ్వాల‌ని అక్క‌డున్న మ‌హిళ‌ల‌ను ఆటో డ్రైవ‌ర్ అడిగాడు. అంతే ఆ చిన్న విష‌యానికే.. దినేశ్‌పై మ‌హిళ‌లు దాడి చేశారు. బెల్ట్‌తో చిత‌క్కొట్టారు.. పంచుల వ‌ర్షం కురిపించారు. చివ‌ర‌కు అత‌ని బ‌ట్ట‌ల‌ను చింపేశారు.

ఈ వ్య‌వ‌హారంపై దినేశ్‌, మ‌హిళ‌లు ప‌ర‌స్ప‌రం మ‌నా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న‌పై దాడి చేసిన మ‌హిళ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని దినేశ్ డిమాండ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.