బంగ్లా-లంక మ్యాచ్‌లో టైమ్‌డ్‌ అవుట్‌..తొలి క్రికెటర్‌గా మాథ్యూస్ రికార్డు

బంగ్లా-లంక మ్యాచ్‌లో టైమ్‌డ్‌ అవుట్‌..తొలి క్రికెటర్‌గా మాథ్యూస్ రికార్డు

విధాత : ఢిల్లీలో సోమవారం బంగ్లాదేశ్‌-శ్రీలంకల మధ్య జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో టైమ్‌డ్‌ అవుట్ సంచలనంగా మారింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇలా అవుటైన తొలి ఆటగాడిగా ఎంజెలో మాథ్యూస్ రికార్డు మూటకట్టుకున్నాడు. సమర విక్రమ అవుటైన తర్వాతా క్రీజ్‌లోకి వచ్చిన మాథ్యూస్‌ తన హెల్మెట్ క్లిప్ పడిపోవడంతో మరో హెల్మెట్ తెప్పించుకున్నాడు. అప్పటికే టైమ్‌డ్‌ అవుట్ అయినట్లుగా బంగ్లా కెప్టెన్ షకీబ్ అప్పీల్ చేశారు. అయితే బంగ్లా జట్టు ఒప్పుకుంటే మాథ్యూస్‌ తన ఆట కొనసాగించవచ్చని అంపైర్లు చెప్పారు.


 



అందుకు బంగ్లా కేప్టెన్ షకీబ్ అంగీకరించకపోవడంతో మాథ్యూస్‌ ఒక్క బాల్ ఆడకుండానే టైమ్‌డ్‌ అవుట్‌గా వెనుతిరగడం విశేషంగా మారింది. క్రికెట్‌లో చాల అరుదుగా జరిగే టైమ్‌డ్‌ అవుట్‌పై మాథ్యూస్‌ ఘటనతో అంతా ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఇలా ఎవరైనా ఎప్పుడైనా అవుటయ్యారా అంటూ చరిత్ర పేజీలు తిప్పేస్తున్నారు నెటిజన్లు, క్రీడాభిమానులు.