World Cup 2023 | వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ విడుద‌ల‌.. అక్టోబ‌ర్ 15న భార‌త్ – పాక్ మ్యాచ్

World Cup 2023 | క్రికెట్ ల‌వ‌ర్స్‌కు గుడ్ న్యూస్. ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్ వ‌చ్చేసింది. భార‌త్‌లో అక్టోబ‌ర్ - న‌వంబ‌ర్ మాసాల్లో జ‌ర‌గ‌నున్న ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 5వ తేదీన అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం కానుంది. లీగ్ ద‌శ‌లో భార‌త్ మొత్తం 9 మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ అక్టోబ‌ర్ 8న ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. […]

World Cup 2023 | వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ విడుద‌ల‌.. అక్టోబ‌ర్ 15న భార‌త్ – పాక్ మ్యాచ్

World Cup 2023 | క్రికెట్ ల‌వ‌ర్స్‌కు గుడ్ న్యూస్. ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్ వ‌చ్చేసింది. భార‌త్‌లో అక్టోబ‌ర్ – న‌వంబ‌ర్ మాసాల్లో జ‌ర‌గ‌నున్న ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 5వ తేదీన అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం కానుంది. లీగ్ ద‌శ‌లో భార‌త్ మొత్తం 9 మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ అక్టోబ‌ర్ 8న ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులైన భార‌త్ – పాక్ మ్యాచ్ అక్టోబ‌ర్ 15వ తేదీన అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

న‌వంబ‌ర్ 15, 16 తేదీల్లో ముంబై, కోల్‌క‌తా వేదిక‌గా సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లు, న‌వంబ‌ర్ 19న అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్ నిర్వ‌హించ‌నున్నారు. ధ‌ర్మ‌శాల‌, ఢిల్లీ, ల‌క్నో, పుణె, ముంబై, అహ్మ‌దాబాద్, హైద‌రాబాద్, బెంగ‌ళూరు, కోల్‌క‌తా, చెన్నై వేదిక‌లుగా మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక హైద‌రాబాద్ న‌గ‌రం మూడు మ్యాచ్‌ల‌కు అతిథ్య‌మివ్వ‌నుంది.