WPL Action | ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం.. స్మృతి మంధనకు రూ.3.40 కోట్లు

కాసుల వర్షం కురిసిస్తున్న ఫ్రాంచైజీలు.. WPL Action | ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ ముంబయిలోని జియో కన్వెన్షన్‌ సెంటర్‌లో కొనసాగుతున్నది. తొలిసారిగా నిర్వహిస్తున్న వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పలువురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. పలువురు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. భారత్‌కు చెందిన స్మృతి మంధనాను రూ.3.40కోట్లకు బెంగళూరు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గార్డనర్‌ రూ.3.20కోట్లకు అహ్మదాబాద్‌ దక్కించుకున్నది. ఇంగ్లాండ్‌కు చెందిన నటాలీ స్కీవర్‌ను ముంబయి ఇండియన్స్‌ రూ.3.20కోట్లకు కొనుగోలు చేసింది. […]

WPL Action | ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం.. స్మృతి మంధనకు రూ.3.40 కోట్లు

కాసుల వర్షం కురిసిస్తున్న ఫ్రాంచైజీలు..

WPL Action | ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ ముంబయిలోని జియో కన్వెన్షన్‌ సెంటర్‌లో కొనసాగుతున్నది. తొలిసారిగా నిర్వహిస్తున్న వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పలువురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. పలువురు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

భారత్‌కు చెందిన స్మృతి మంధనాను రూ.3.40కోట్లకు బెంగళూరు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గార్డనర్‌ రూ.3.20కోట్లకు అహ్మదాబాద్‌ దక్కించుకున్నది. ఇంగ్లాండ్‌కు చెందిన నటాలీ స్కీవర్‌ను ముంబయి ఇండియన్స్‌ రూ.3.20కోట్లకు కొనుగోలు చేసింది.

భారత ఆటగాళ్లు దీప్తి శర్మను రూ.2.26కోట్లకు లక్నో, జెమీమా రొడ్రిగ్స్‌ను రూ.2.20కోట్లకు ఢిల్లీ, ఆస్ట్రేలియా క్రికెటర్‌ బెత్‌ మూనిని రూ.2కోట్లకు అహ్మదాబాద్‌, సోఫీ ఎక్లెస్టోన్‌ (ఇంగ్లండ్‌)ను రూ.1.80కోట్లకు లక్నో, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (భారత్‌)ను రూ.1.80కోట్లకు ముంబయి, ఎల్లీస్‌ పెర్రీ (ఆస్ట్రేలియా) రూ.1.70కోట్లకు బెంగళూరు, రేణుకా సింగ్‌ (భారత్‌)ను రూ.1.50కోట్లకు బెంగళూరు, తహ్లియా మెక్‌గ్రాత్‌ (ఆస్ట్రేలియా) రూ.1.40కోట్లకు లక్నో, మెగ్‌ లాన్నింగ్‌ (ఆస్ట్రేలియా) రూ.1.10కోట్లకు ఢిల్లీ, షబ్నిమ్ ఇస్మైల్ (దక్షిణాఫ్రికా) రూ.కోటి, అమేలియా కెర్‌ (న్యూజిలాండ్‌) రూ.కోటికి ముంబయి ఇండియా కొనుగోలు చేసింది.

ఇక భారత యువ సంచలనం షెఫాలీ వర్మను రూ.2కోట్లకు ఢిల్లీ జట్టు సొంతం చేసుకున్నది. ఇంకా వేలం కొనసాగుతున్నది. ప్రస్తుతం తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ క్రమంలో ఆటగాళ్ల కోసం వేలం నిర్వహిస్తుండగా.. ప్రతి జట్టుకు గరిష్ఠంగా రూ.12కోట్లు ఖర్చు చేయనున్నాయి.

ఆరుగురు విదేశీ ఆటగాళ్లు సహా మొత్తం 18 మందిని కొనుగోలు చేయవచ్చు. కనీసం 15 మందినైనా తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఊహించిన విధంగానే స్మృతి మంధానా, గార్డనర్‌, నటాలీ స్కీవర్‌, షఫాలీ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ తదితర క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. ప్రస్తుతం యాక్షన్‌ ఇంకా కొనసాగుతున్నది.