WPL Auction | నేడు ఉమెన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌ వేలం.. అందరి దృష్టి వారిపైనే..!

WPL Auction | మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) వేలం సోమవారం జరుగనున్నది. ఐపీఎల్‌ తరహాలో తొలిసారిగా జరుగుతున్న ఈ వేలంలో 409 మందితో క్రీడాకారుల జాబితాను సిద్ధం చేశారు. ఇందులో 90 మంది ఆటగాళ్లను వేలం వేయనున్నారు. ఒక్కో జట్టు గరిష్ఠంగా 18 మందిని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. భారత్‌తో సహా 15 దేశాలకు చెందిన స్టార్స్‌ వేలానికి రానున్నారు. స్టార్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, యువ సంచలనం షెఫాలీ వర్మ […]

WPL Auction | నేడు ఉమెన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌ వేలం.. అందరి దృష్టి వారిపైనే..!

WPL Auction | మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) వేలం సోమవారం జరుగనున్నది. ఐపీఎల్‌ తరహాలో తొలిసారిగా జరుగుతున్న ఈ వేలంలో 409 మందితో క్రీడాకారుల జాబితాను సిద్ధం చేశారు. ఇందులో 90 మంది ఆటగాళ్లను వేలం వేయనున్నారు. ఒక్కో జట్టు గరిష్ఠంగా 18 మందిని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. భారత్‌తో సహా 15 దేశాలకు చెందిన స్టార్స్‌ వేలానికి రానున్నారు. స్టార్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, యువ సంచలనం షెఫాలీ వర్మ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలువనుండగా.. ఫ్రాంచైజీలు వీరిపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అలాగే అలీసా హేలీ, బేత్‌ మూనీ, ఎలిస్‌ పెర్రీ, మెగాన్‌ షట్‌ (ఆస్ట్రేలియా), నాట్‌ సీవర్‌ (ఇంగ్లాండ్‌), డాటిన్‌ (వెస్టిండీస్‌) తదితర విదేశీ స్టార్లకు భారీ ధర పలుకనున్నట్లు అంచనా. వేలంలో ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, ఆర్సీబీ, గుజరాత్‌ టైటాన్స్‌, యూపీ వారియర్స్‌ ఆటగాళ్ల కోసం పోటీపడనున్నాయి. ప్రతి జట్టు గరిష్ఠంగా రూ.12కోట్లు ఖర్చు చేయొచ్చు. ఆరుగు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. కనీసం 15 మందిని తీసుకోవాల్సి ఉండగా.. క్రికెటర్ల కనీస ధర రూ.10లక్షలతో ప్రారంభంకానున్నది. అత్యధిక కనీస ధర రూ.50 లక్షలు కాగా.. రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.40 లక్షల విభాగాలు సైతం ఉన్నాయి. స్మృతి, షెఫాలీ, హర్మన్‌ప్రీత్‌, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మలకు రూ.1.25 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ధర రావొచ్చని అంచనా వేస్తున్నారు.

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌, సీమర్‌ రేణుక ఠాకుర్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, రిచా యాదవ్‌, సీమర్లు మేఘన సింగ్‌, శిఖ పాండేల కోసం కూడా ప్రాంచైజీలు పోటీపడే అవకాశాలున్నాయి. అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోని సభ్యులు శ్వేత సెహ్రావత్‌, పర్శవి చోప్రా, మన్నత్‌ కశ్యప్‌, అర్చన దేవి, తితాస్‌ సాధుపై సైతం దృష్టి సారించనున్నాయి. ఈ వేలంలో 246 మంది భారత క్రికెటర్లు, 163 మంది విదేశీ క్రికెటర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉండగా.. వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ మార్చి 4 నుంచి 26 వరకు జరుగనున్నది.