వైభవంగా ప్రారంభమైన యాదాద్రి బ్రహ్మోత్సవాలు
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, జగత్ రక్షకుడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి

- ఇంకాసేపట్లో యాదాద్రికి సీఎం రేవంత్ రెడ్డి
విధాత : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, జగత్ రక్షకుడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం యాజ్ఞిక బృందం పర్యవేక్షణలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ఘట్టం మొదలైంది. శ్రీ విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు శాస్త్రయుక్తంగా ప్రారంభించారు.
ఈనెల 21 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 18వ తేదీన స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభ ఘట్టం వేళ ఇంకా సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రుల బృందంతో కలిసి యాదాద్రి ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.