గోవర్ధనగిరి ధారిగా దర్శనమిచ్చిన నరసింహుడు

విధాత: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఆదివారం ఉదయం స్వామివారు గోవర్ధనగిరిధారి అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. గర్భాలయంలో మూలవర్యులకు నిత్యారాధనలు, అభిషేకాల అనంతరం స్వామివారికి గోవర్ధనగిరి ధారి అలంకార సేవ నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. జగత్ రక్షకుడు శ్రీ మహా విష్ణువు కృష్ణా వతారంలో గోవర్ధనగిరిని చిటికెన వేలు పై ఎత్తి ఇంద్రుడి గర్వాన్ని అణిచి తన ఆశ్రయంలోని రేపల్లె ప్రజలను సంరక్షించడం ద్వారా తన శరణాగతులైన భక్తజనానికి సర్వదా […]

  • By: krs    latest    Feb 26, 2023 6:25 AM IST
గోవర్ధనగిరి ధారిగా దర్శనమిచ్చిన నరసింహుడు

విధాత: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఆదివారం ఉదయం స్వామివారు గోవర్ధనగిరిధారి అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. గర్భాలయంలో మూలవర్యులకు నిత్యారాధనలు, అభిషేకాల అనంతరం స్వామివారికి గోవర్ధనగిరి ధారి అలంకార సేవ నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు.

జగత్ రక్షకుడు శ్రీ మహా విష్ణువు కృష్ణా వతారంలో గోవర్ధనగిరిని చిటికెన వేలు పై ఎత్తి ఇంద్రుడి గర్వాన్ని అణిచి తన ఆశ్రయంలోని రేపల్లె ప్రజలను సంరక్షించడం ద్వారా తన శరణాగతులైన భక్తజనానికి సర్వదా అండగా ఉంటానంటూ చాటుకున్నారు.

గోవర్ధనగిరి ధారిగా లక్ష్మీనరసింహుడు మంగళ వాయిద్యాలతో , తీర్థజనుల జయ జయ ద్వానాల మధ్య మాడవీధులలో విహరించగా భక్తజన సంరక్షకుడైన స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులయ్యారు.

అలంకార సేవలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లందీగల్ లక్ష్మీ నరసింహ చార్యులు, ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం స్వామివారు సింహవాహనంపై ఊరేగనున్నారు.