Yadadri | లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న పంజాబ్ మంత్రి

Yadadri సీఎం ద‌త్త‌త గ్రామం వాసాల మర్రి సందర్శన విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని పంజాబ్ రాష్ట్ర సామాజిక న్యాయం, మైనారిటీ శాఖ మంత్రి బాల్ జిత్ కౌర్ తన అధికారుల బృందంతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీతా స్వాగతం పలికారు. పూజల అనంతరం వారికి ఈవో గీత స్వామివారి లడ్డుప్రసాదాలు అందించారు. ఆలయ నిర్మాణ విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి […]

Yadadri | లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న పంజాబ్ మంత్రి

Yadadri

  • సీఎం ద‌త్త‌త గ్రామం వాసాల మర్రి సందర్శన

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని పంజాబ్ రాష్ట్ర సామాజిక న్యాయం, మైనారిటీ శాఖ మంత్రి బాల్ జిత్ కౌర్ తన అధికారుల బృందంతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీతా స్వాగతం పలికారు. పూజల అనంతరం వారికి ఈవో గీత స్వామివారి లడ్డుప్రసాదాలు అందించారు.

ఆలయ నిర్మాణ విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి బాల్ జిత్ కౌర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా శిల్పకళతో స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిందని కితాబులిచ్చారు. అనంతరం బాల్ జిత్ కౌర్ బృందం సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాల మర్రిని సందర్శించి దళిత బంధు పథకం అమలు తీరును పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో న్యాయ మైనారిటీ శాఖ మంత్రిత్వ శాఖ అధికారులు జి. రమేష్ కుమార్, డైరెక్టర్ జన్ ప్రిత్ సింగ్, జగదీశ్ శర్మలు, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, షెడ్యూల్ కులాల శాఖ అధికారులు కిషన్, శ్యాంసుందర్, మహేందర్ పాల్, సర్పంచ్ ఆంజనేయుల రవి, కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.