యాదాద్రి: ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి క‌ల్యాణ టికెట్లు విడుద‌ల‌

విధాత‌: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం తర్వాత ఆలయ మాడవీధుల్లో మొట్టమొదటిసారిగా వార్షిక కళ్యాణం జరగనుంది. ఫిబ్రవరి 28న జరగబోయే స్వామి వారి కల్యాణ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం శనివారం నుంచి యాదాద్రి దేవస్థానం కల్యాణ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. టికెట్లు దేవస్థానం ప్రధాన బుకింగ్ కౌంటర్ వద్ద […]

  • By: krs    latest    Dec 03, 2022 12:34 PM IST
యాదాద్రి: ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి క‌ల్యాణ టికెట్లు విడుద‌ల‌

విధాత‌: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.

యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం తర్వాత ఆలయ మాడవీధుల్లో మొట్టమొదటిసారిగా వార్షిక కళ్యాణం జరగనుంది. ఫిబ్రవరి 28న జరగబోయే స్వామి వారి కల్యాణ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం శనివారం నుంచి యాదాద్రి దేవస్థానం కల్యాణ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

టికెట్లు దేవస్థానం ప్రధాన బుకింగ్ కౌంటర్ వద్ద అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. టికెట్ ధర రూపాయలు 3000గా నిర్ణయించగా టికెట్ కొనుగోలుతో దంపతులు స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు