Yahoo Layoff | లే ఆఫ్స్ తంతు.. వెయ్యి మంది ఉద్యోగులకు యాహూ ఉద్వాసన
Yahoo Layoff | ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఫేస్‌బుక్, మెటా, అమెజాన్ మైక్రోసాఫ్ట్, గూగుల్‌తో పాటు బడా కార్పోరేట్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా యాహూ ఇంక్ సైతం ఉద్యోగులను తొలగిస్తున్నది. 20శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కంపెనీ తొలగించే అవకాశం ఉన్నది. కంపెనీ యాడ్ టెక్ విభాగాన్ని పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. సమాచారం ప్రకారం.. కంపెనీ […]

Yahoo Layoff | ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఫేస్‌బుక్, మెటా, అమెజాన్ మైక్రోసాఫ్ట్, గూగుల్‌తో పాటు బడా కార్పోరేట్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా యాహూ ఇంక్ సైతం ఉద్యోగులను తొలగిస్తున్నది. 20శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కంపెనీ తొలగించే అవకాశం ఉన్నది.
కంపెనీ యాడ్ టెక్ విభాగాన్ని పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. సమాచారం ప్రకారం.. కంపెనీ సంబంధిత విభాగం నుంచి 20శాతం మంది కంటే ఎక్కువ ఉద్యోగులకు ఉద్వాసన పలుకనుండగా.. యాడ్ టెక్ ఉద్యోగుల్లో 50శాతం మందిని ప్రభావితం చేయనున్నది.
దాదాపు 1600 మంది వరకు ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. యాహూలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 12శాతం అంటే వెయ్యి మంది ఉద్యోగులకు తొలగిస్తామని, రాబోయే ఆరు నెలల్లో మిగితా ఎనిమిది శాతం అంటే 600 మందిని తొలగించనున్నట్లు కంపెనీ సీఈవో జిమ్ లాన్జోన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అనిశ్చిత ఆర్థిక వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ లే ఆఫ్స్ ప్రకటించినట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా.. వినోద ప్రపంచంలో ఎంతో గుర్తింపు ఉన్న డిస్నీలో రిట్రెంచ్ దశ ప్రారంభమైంది. దాదాపు 7వేల మంది ఉద్యోగులను బయటకు పంపేందుకు కంపెనీ నిర్ణయించినట్లు సీఈవో బాబ్ ఇగర్ సంకేతాలిచ్చారు. అమెరికాలోని చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. బుధవారం టెక్ కంపెనీ జూమ్ 1300 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం డెల్ 6వేల మందికిపైగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు వెల్లడించింది.