కెప్టెన్‌గా శివాజి శిష్యుడు.. టాస్క్‌లలో తెగ కొట్టేసుకున్న హౌజ్‌మేట్స్

బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం ఇంట్లోని సభ్యులని ఆటగాళ్లు, పోటుగాళ్లు అంటూ రెండు గ్రూపులుగా విభజించి వారికి పలు టాస్క్‌లు ఇస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఏకంగా ఏడు టాస్క్‌లు ఇచ్చారు.ఇందులో ఎవరైతే బెస్ట్ ఇస్తారో వారు కెప్టెన్సీ పోటీదారులుగా ఉంటారు.
ఆటగాళ్లు టీంలో ఉన్న శివాజీ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, సందీప్, అమర్, తేజ, శోభ, ప్రియాంక ఉండగా, పోటుగాళ్లు టీంలో ఉన్న అర్జున్, గౌతమ్, భోళె, నయని, అశ్విని, పూజా మూర్తి ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఏడు టాస్కుల్లో.. ఫిటెస్ట్, జీనియస్, స్ట్రాంగెస్ట్ గా పోటుగాళ్లు నిలవగా.. ఫాస్టెస్ట్, స్మార్టెస్ట్, ఫోకస్‌డ్‌గా ఆటగాళ్లు నిలిచి.. పోటుగాళ్ల బోర్డ్‌తో తమ బోర్డును సమం చేసుకోండం గత ఎపిసోడ్‌లో చూశాం. ఇక చివరిదైన టాస్క్ తాజా ఎపిసోడ్‌లో జరిగింది.
హూ ఈజ్ ది బెస్ట్ అనే టాస్క్‌లో భాగంగా ఈ గేమ్‌లో ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తారో, వాళ్లు ఈ టాస్క్‌లో విన్నర్ అని తెలియజేస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ అచ్చం డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలోనే సాగింది. బాల్ కోసం.. గోల్ చేయడం కోసం ఒకరి మీద ఇంకొకరు పడుతూ నానా తంటాలు పండారు.
ఎంతో రసవత్తరంగా సాగిన ఈ గేమ్‌లో పోటుగాళ్ల టీంపై ఆటగాళ్ల టీం విజయం సాధిస్తారు. ఈ క్రమంలో కెప్టెన్సీ కంటెడర్స్ స్టేజ్‌కు వెళతారు ఆటగాళ్లు టీం. అదేకాక బిగ్ బాస్ అభినందనలు కూడా పొంది బెస్ట్ ట్యాగ్ కూడా అందుకుంటారు. ఇక ఆటగాళ్లు టీంలో ఉన్న కెప్టెన్నీ కంటెడర్స్ అందరూ కూడా బెలూన్స్ ధరించాలని బిగ్ బాస్ తెలియజేస్తాడు.
అనంతరం పోటుగాళ్ళు టీమ్ లో ఒక్కో సభ్యుడు బజర్ మోగిన తర్వాత సూదిని కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న వారిలో వారికి ఇష్టమైన వారికి ఇవ్వాలని బిగ్ బాస్ చెబుతాడు. అలా సూది అందుకున్న సభ్యులు మిగిలిన వారిలో కెప్టెన్సీ అర్హత ఎవరికీ లేదు అని భావిస్తారో వారి బెలూన్ ని గుచ్చాల్సి ఉంటుంది.. ఆట సందీప్.. ప్రశాంత్ బెలూన్ ని గుచ్చడం జరుగుతుంది.
ఇక అర్జున్.. సూదిని తేజ చేతికి ఇవ్వగా, ఆ సమయంలో యావర్, అమర్ దీప్ ఉన్నారు. అప్పుడు తేజ ఊహించని విధంగా అమర్ దీప్ బెలూన్ ని పగలగొట్టారు. దీనితో అమర్ దీప్ లబోదిబో మన్నాడు. ఇక చివరికి రేసులో తేజ, యావర్ ఉండగా, బిగ్ బాస్ ఒక అనౌన్స్‌మెంట్ చేస్తాడు. బజర్ మోగినప్పుడు పోటుగాళ్ళు టీంలో ఒకరు సూదిని దక్కించుకొని డిస్కస్ చేయకుండా ఒకరి బెలూన్ పగలగొట్టి ఇంకొకరిని కెప్టెన్ చేయాలి అని ప్రకటిస్తాడు. పావనికి సూది దక్కగా, ఆమె తేజ బెలూన్‌ని పగలగొట్టి యావర్‌ని బిగ్ బాస్ కెప్టెన్ చేస్తుంది. దీంతో ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జిని యావర్ చెంతకి చేరింది.