ఈనాడుపై నిప్పులు గక్కిన YCP..
అంబటి, కొడాలి, కన్నబాబు వరుస ప్రెస్‌మీట్‌లు జిల్లాల్లో ఈనాడు వార్తా పత్రికలు దగ్ధం విధాత: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను పోలీసులు కస్టడీలో విపరీతంగా కొట్టారంటూ ఈనాడు రెండేళ్ల క్రితం ఫోటోలతో ప్రచురించిన కథనం ఇంకా మండుతోంది.. అంతేకాదు ఆ పేపర్లు సైతం మంటల్లో మండుతున్నాయ్.. 2001లో జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటోలు మళ్ళీ వినియోగించి నిన్నామొన్న మళ్ళీ ఆయన్ను పోలీసులు ఇంతలా కొట్టారు అంటూ ఈనాడులో వచ్చిన కథనానికి మారునాడే.. ఖండన, సవరణ సైతం […]

- అంబటి, కొడాలి, కన్నబాబు వరుస ప్రెస్‌మీట్‌లు
- జిల్లాల్లో ఈనాడు వార్తా పత్రికలు దగ్ధం
విధాత: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను పోలీసులు కస్టడీలో విపరీతంగా కొట్టారంటూ ఈనాడు రెండేళ్ల క్రితం ఫోటోలతో ప్రచురించిన కథనం ఇంకా మండుతోంది.. అంతేకాదు ఆ పేపర్లు సైతం మంటల్లో మండుతున్నాయ్.. 2001లో జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటోలు మళ్ళీ వినియోగించి నిన్నామొన్న మళ్ళీ ఆయన్ను పోలీసులు ఇంతలా కొట్టారు అంటూ ఈనాడులో వచ్చిన కథనానికి మారునాడే.. ఖండన, సవరణ సైతం ఈనాడు ప్రచురించింది.
ఉదయం ఎమ్మెల్యే కన్నబాబు.. మధ్యాహ్నం కొడాలి నాని..
అంతేకాకుండా ఆ తప్పుడు ఫోటోలకు సంబంధించి ముగ్గురు సబ్ ఎడిటర్లను ఈనాడు తొలగించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గురువారం వైసీపీ అధిష్టానం ముగ్గురు లీడర్లను ఉసిగొల్పి ఈనాడు మీద మాటల దాడి చేయించింది.
ఉదయం ఈనాడు మాజీ రిపోర్టర్, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఈనాడు మీద దూకుడుగా కామెంట్లు చేయగా, మధ్యాహ్నం కొడాలి నాని తనదైన బాణీలో ప్రెస్‌మీట్‌లో రామోజీరావు మీద తగులుకున్నారు. తప్పుడు వార్తలు.. తప్పుడు బతుకులు అంటూ దునుమాడారు… ఇకముందు ఇలాంటివి సాగేది లేదని హెచ్చరించారు.
అంబటి మాటల దాడి..
ఇక సాయంత్రం మంత్రి అంబటి రాంబాబు కూడా ఈనాడు మీద మాటలదాడి కొనసాగించారు. బుర్రల్లో విషం పెట్టుకుని పత్రికను నడుపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ఊడిగం చేయడమే రామోజీరావు లక్ష్యం అంటూ విమర్శించారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు పట్టణాల్లో ఈనాడు ప్రతులను దగ్ధం చేస్తూ రామోజీరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.