యోగ, మెడిటేషన్, ఆటలు బోధనలో తప్పనిసరి కావాలి

యోగ, మెడిటేషన్, ఆటల పోటీలు కళాశాలలో బోధనలో తప్పనిసరిగా భాగం కావాలని శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి. నీరజ ప్రభాకర్ అన్నారు. రాజేంద్రనగర్ లోని ఉద్యాన కళాశాలలో మూడు రోజుల పాటు జరిగే అంతర కళాశాల క్రీడలు, ఆటలు, సంస్కృతిక, వైజ్ఞాన సమ్మేళనం 2022-23 కు ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు, ఆటల పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో సొంత […]

  • By: krs    latest    Dec 08, 2022 5:32 PM IST
యోగ, మెడిటేషన్, ఆటలు బోధనలో తప్పనిసరి కావాలి

యోగ, మెడిటేషన్, ఆటల పోటీలు కళాశాలలో బోధనలో తప్పనిసరిగా భాగం కావాలని శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి. నీరజ ప్రభాకర్ అన్నారు. రాజేంద్రనగర్ లోని ఉద్యాన కళాశాలలో మూడు రోజుల పాటు జరిగే అంతర కళాశాల క్రీడలు, ఆటలు, సంస్కృతిక, వైజ్ఞాన సమ్మేళనం 2022-23 కు ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు, ఆటల పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో సొంత వ్యక్తిత్వం, స్వయం నమ్మకం, జీవితం పైన పాజిటివ్ దృక్పథం, మంచి ప్రవర్తన పెరగడంతోపాటు ఆరోగ్యం మెరుగవుతుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉద్యాన విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కావాల్సిన వాతావరణం కల్పించామని వైస్ ఛాన్స్లర్ పేర్కొన్నారు.

ఆట పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల మానసిక, సాంఘిక, సంస్థాగత ప్రవర్తన శక్తి పెరగడంతో పాటు సమగ్రత, టీమ్ స్పిరిట్, పరస్పరం పంచుకోవడం, సాంఘిక బాధ్యతను తీసుకోవడం విద్యార్థులకు అలవాటుగా మారుతుందన్నారు. తమ అంతర్గత శక్తులు, మేథో సంపత్తిని ప్రపంచానికి తెలిపేందుకు క్రీడలు ఉపయోగపడతాయని వైస్ ఛాన్స్లర్ అన్నారు.

క్రీడలు, సాంస్కృతిక పోటీలలో గెలుపోటములు సహజమని, వాటిలో పాల్గొనడమే ప్రధాన ఉద్దేశంగా విద్యార్థులు తీసుకోవాలని డాక్టర్ నీరజ ప్రభాకర్ విద్యార్థులను కోరారు. చదువుల్లోన్తెనా, వ్యక్తిగతంగానైనా ప్రవర్తనే ముఖ్యమని, అది కోల్పోతే సర్వసం కోల్పోయినట్లేనని డాక్టర్ నీరజ ప్రభాకర్ పేర్కొన్నారు.

2023 జనవరి మూడో వారంలో అఖిల భారత వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల మధ్య సంస్కృతిక పోటీలు కర్ణాటకలోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ లో జరుగుతాయి. అలాగే హర్యానాలోని చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చర్ వర్సిటీలో అఖిల భారత వ్యవసాయ విశ్వ విద్యాలయాల క్రీడా పోటీలు 2023 ఫిబ్రవరి నెలలో జరుగుతాయని, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విద్యాలయ విద్యార్థులు సైతం ఆ పోటీలలో పాల్గొంటారని వైస్- ఛాన్స్లర్ చెప్పారు.

రాజేంద్రనగర్, మోజర్లలోని ఉద్యాన కళాశాలల నుంచి 57 మంది విద్యార్థులు, 67 మంది విద్యార్థినులు పాల్గొనే ఈ పోటీలలో 38 క్రీడలు, 15 సంస్కృతిక పోటీలు, నాలుగు వైజ్ఞానిక పోటీలు ఉంటాయి.
కార్యక్రమంలో వర్సిటీ హార్టికల్చర్ డీన్ డాక్టర్ అడపా కిరణ్ కుమార్, రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రశాంత్, మోజెర్ల కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.