బండ రాళ్ల మధ్య యువకుడు.. మూడు రోజులుగా నరకయాతన.. కాసేపట్లో బయటకు

కామారెడ్డి జిల్లా సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో ఘటన కొనసాగుతున్న సహాయక చర్యలు విధాత, నిజామాబాద్‌: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ శివారులోని గుట్టల్లో వేటకు వెళ్లిన యువకుడు బండ రాళ్ల మధ్య ఇరుక్కుపోయి నరకయాతన అనుభవిస్తున్నాడు. రాళ్లను తొలగించి యువకున్ని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వివరాళ్లోకి వెళితే సింగరాయపల్లి పక్కనే ఉన్న రెడ్దిపేట గ్రామానికి చెందిన చాడ రాజు (37) అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి మంగళవారం అటవీ ప్రాంతానికి […]

  • By: krs    latest    Dec 15, 2022 4:26 AM IST
బండ రాళ్ల మధ్య యువకుడు.. మూడు రోజులుగా నరకయాతన.. కాసేపట్లో బయటకు
  • కామారెడ్డి జిల్లా సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో ఘటన
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

విధాత, నిజామాబాద్‌: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ శివారులోని గుట్టల్లో వేటకు వెళ్లిన యువకుడు బండ రాళ్ల మధ్య ఇరుక్కుపోయి నరకయాతన అనుభవిస్తున్నాడు. రాళ్లను తొలగించి యువకున్ని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

వివరాళ్లోకి వెళితే సింగరాయపల్లి పక్కనే ఉన్న రెడ్దిపేట గ్రామానికి చెందిన చాడ రాజు (37) అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి మంగళవారం అటవీ ప్రాంతానికి వెళ్లారు. అయితే ఏదు అని పిలువబడే వన్య ప్రాణి వేటలో భాగంగా గుట్ట ప్రాంతంలో గల రెండు బండ రాళ్ల మధ్యకు దిగినప్పుడు అందులో చిక్కుకున్నట్లు సమాచారం.

దీంతో సదరు యువకుడు బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించక పోవడంతో గ్రామస్తుల సహకారంతో కుటుంబ సభ్యులు గుట్ట వద్దకు చేరుకుని రాజును బయటకు తీసేందుకు ప్రయత్నించారు.

అదే విధంగా పోలీసు అధికారులకు సమాచారం అందించడంతో బండ రాళ్ల నుండి యువకున్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ప్రస్తుతం గుట్ట వద్ద పెద్ద పోక్లైన్ లను రప్పించారు. కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ అనన్య, డీస్పీ సోమనాథం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న తెలిసిన వెంటనే సమీప గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

గుహ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ.. మరి కొద్ది సేపట్లో బయటకు

ఐదు పేలుళ్ల తర్వాత రాజును వెలికి తీసేందుకు మార్గం సుగమమైంది.. కామారెడ్డి జిల్లా సింగరాయపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గల బండ రాళ్ల మధ్య గుహలో ఇరుక్కు పోయిన షాడ రాజును బయటకు తీయడానికి సుమారు 40 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ, ఫైర్ సిబ్బంది రాజును రక్షించే చర్యలు చేపట్టారు.

ముఖ్యంగా రాజును వెలికి తీసేందుకు అతని ఒంటిపై కొబ్బరి నూనెను పూసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికుడు అయిన అశోక్ అనే వ్యక్తిని లోనికి పంపించారు. అశోక్ సన్నగా ఉండడం వల్ల అతన్ని లోనికి పంపించారు. మరి కొద్దిసేపట్లో రాజు సురక్షితంగా బయటకు వచ్చే అవకాశం వుంది. కాగా రాజు కుటుంబ సభ్యులు ఘటనా స్థలి వద్దే ఉన్నారు.

43 గంటల రెస్క్యూ ఆపరేషన్.. బండ రాళ్ల మధ్య నుంచి సురక్షితంగా బయట పడిన రాజు