మెదక్ జిల్లాలో దారుణం: గొంతు కోసి…బండరాయితో తలపై కొట్టి యువకుడి హ‌త్య‌

మృతుడు నిజామోద్దిన్‌గా గుర్తింపు ద‌ర్యాప్తు చేపట్టిన పోలీసులు విధాత, మెదక్ బ్యూరో: జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలోని బీడీ కార్మికుల కాలనీలో నిర్జీవ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని గొంతు కోసి, తలపై బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతుడు మెదక్ పట్టణంలోని రషీద్ కాలనీకి చెందిన నిజామొద్దిన్‌గా పోలీస్‌లు గుర్తించారు. పోలీస్‌లు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామొద్దిన్ కుటుంబం వెల్దుర్తి మండల జలాల్‌పూర్ నుండి మూడు […]

మెదక్ జిల్లాలో దారుణం: గొంతు కోసి…బండరాయితో తలపై కొట్టి యువకుడి హ‌త్య‌
  • మృతుడు నిజామోద్దిన్‌గా గుర్తింపు
  • ద‌ర్యాప్తు చేపట్టిన పోలీసులు

విధాత, మెదక్ బ్యూరో: జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలోని బీడీ కార్మికుల కాలనీలో నిర్జీవ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని గొంతు కోసి, తలపై బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతుడు మెదక్ పట్టణంలోని రషీద్ కాలనీకి చెందిన నిజామొద్దిన్‌గా పోలీస్‌లు గుర్తించారు.

పోలీస్‌లు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామొద్దిన్ కుటుంబం వెల్దుర్తి మండల జలాల్‌పూర్ నుండి మూడు సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం మెదక్‌కు వచ్చి రషీద్ కాలనీలో కూలీ పనులు చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. మంగళ వారం ఉదయం స్వగ్రామానికి వెళ్ళిన నిజామొద్దిన్ సాయంత్రానికి చేపలు తీసుకొని ఇంటికి వచ్చి భార్య షబానా బేగంకు ఇచ్చాడు.

దోస్తును కలిసి వస్తానని చెప్పి బైక్ పై వెళ్ళిన వ్యక్తి ఇంటికి తిరిగి రాలేదు. బుధ‌వారం నిజాముద్దీన్ హత్య వెలుగులోకి వచ్చింది. కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ సైదులు, సీఐ మధు పోలీస్ సిబ్బంది ఘటన స్థలం చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలానికి దాస్పాడు క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. మృతుడి సెల్ ఫోన్ సైతం కనిపించడం లేదు. భార్య షబానా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీఐ మధు దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.