YS JAGAN | ఏం చేద్దామ్.. ఎలా చేద్దాం! ముఖ్యులతో జగన్ చర్చ!!
YS JAGAN విధాత: చనిపోయిన వివేకానందరెడ్డి ఇప్పుడు ఏపీలో ఎంతో మంది ముఖ్యులను భయపెడుతున్నారు. ముఖ్యంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో ఈ హత్య పెద్ద సంచలనంగా మారింది. ఇది అటు తిరిగి.. ఇటు తిరిగి వైయస్ జగన్ దగ్గరకు వచ్చింది… ఇప్పటికే ఆ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అవినాష్‌ను కూడా విచారణకు పిలిచింది. ఈలోపు ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా […]

YS JAGAN
విధాత: చనిపోయిన వివేకానందరెడ్డి ఇప్పుడు ఏపీలో ఎంతో మంది ముఖ్యులను భయపెడుతున్నారు. ముఖ్యంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో ఈ హత్య పెద్ద సంచలనంగా మారింది. ఇది అటు తిరిగి.. ఇటు తిరిగి వైయస్ జగన్ దగ్గరకు వచ్చింది…
ఇప్పటికే ఆ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అవినాష్‌ను కూడా విచారణకు పిలిచింది. ఈలోపు ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా దాన్ని రేపు మంగళవారం విచారకు తీసుకుంది. దీంతో రేపు సాయంత్రం లోపు ఆ బెయిల్ పిటిషన్ మీద కోర్టు ఓ నిర్ణయం వెలువరిస్తే ఆ తరువాత సాయంత్రం విచారణకు రావచ్చని సీబీఐ అవినాష్‌కు ఆఫర్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా అవసరం అయితే అవినాష్‌ను సైతం అరెస్ట్ చేస్తాం అంటూ సీబీఐ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం జగన్ను కలవర పెడుతోంది. అవినాష్ గానీ అరెస్ట్ అయితే పార్టీ ఇమేజికి పెద్ద డ్యామేజి జరుగుతుంది. దగ్గర్లోనే అసెంబ్లీ ఎన్నికలున్నాయ్.. ఇలాంటప్పుడు సీఎం తమ్ముడు హత్య కేసులో అరెస్ట్ అయితే ఎంత డ్యామేజి అవుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే జగన్ (YS JAGAN)తాజాగా హుటాహుటిన పార్టీ ముఖ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐవి సుబ్బారెడ్డి తదితరులను పిలిపించుకుని జగన్ లోతుగా చర్చించినట్లు తెలిసింది.
ఈ అరెస్టుల ప్రభావం ఎలా ఉంటుంది.. మనం ఎలా ముందుకుపోవాలి.. ఆ డ్యామేజి కంట్రోల్ చేయడానికి ఏమి చేయాలన్నదానిమీద చర్చించినట్లు తెలిసింది. కడపజిల్లాలో పులివెందులలో జగన్ తరఫున రాజకీయం చేసే వాళ్ళు భాస్కర్ రెడ్డి తదితరులు అరెస్ట్ కావడంతో జిల్లా మీద పట్టు సాధించడం కష్టమే… ఇప్పటికే టిడిపి.. ఎల్లో మీడియా జగన్ కుటుంబం మీద దుమ్మెత్తి పోస్తోంది. ఈ తరుణంలో వాళ్ళను ఎలా అడ్డుకోవడం అనేదానిమీద జగన్ ఆ పెద్దలతో మాట్లాడారు.
ఇప్పటికే అనంతపురం టూర్‌ను వాయిదా వేసుకున్న జగన్ హుటాహుటిన ఢిల్లీ వెళ్తారని పుకార్లు వచ్చాయ్.. కానీ ఢిల్లీ టూర్ ఇంకా ఖరారు కాలేదు.. పార్టీకి జరిగే నష్టాన్ని.. ఇమేజిని ఎలా కాపాడాలి అనేదానిమీద జగన్ గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలిసింది..