Zheer Alikhan | ఉర్దూ జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జాహిర్ అలీఖాన్

Zheer Alikhan డెక్కన్ హెరిటేజ్ చైర్మన్ వేదకుమార్ విధాత‌: ఉర్దూ జర్నలిజంలో సరికొత్త సాంకేతికతతో సియాసత్ ఉర్దూ దిన పత్రిక మేనేజింగ్ఎడిటర్ జాహిర్ అలీఖాన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్ తెలిపారు. జాహిర్ అలీఖాన్ ఆకస్మిక మరణం పట్ల ఆయ‌న ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం కుల, జాతి విబేధం లేకుండా తన జర్నలిజంలో కొత్త పంథా ను తీసుకువచ్చిన వ్యక్తిగా జాహిర్ అలీఖాన్‌ గుర్తింపు పొందారన్నారు. […]

  • By: krs    latest    Aug 08, 2023 11:42 PM IST
Zheer Alikhan | ఉర్దూ జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జాహిర్ అలీఖాన్

Zheer Alikhan

డెక్కన్ హెరిటేజ్ చైర్మన్ వేదకుమార్

విధాత‌: ఉర్దూ జర్నలిజంలో సరికొత్త సాంకేతికతతో సియాసత్ ఉర్దూ దిన పత్రిక మేనేజింగ్ఎడిటర్ జాహిర్ అలీఖాన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్ తెలిపారు. జాహిర్ అలీఖాన్ ఆకస్మిక మరణం పట్ల ఆయ‌న ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం కుల, జాతి విబేధం లేకుండా తన జర్నలిజంలో కొత్త పంథా ను తీసుకువచ్చిన వ్యక్తిగా జాహిర్ అలీఖాన్‌ గుర్తింపు పొందారన్నారు.

పేదలకు సహాయం చేసే కార్యక్రమాల నుండి, మైనారిటీ అభివృద్ధి ఫోరంఏర్పాటు, మురికివాడల నివాసితులకు ఉచిత ఆరోగ్య సంరక్షణ, పేద మహిళలకు నైపుణ్య శిక్షణ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల నిర్వహణ మొదలగు కార్యక్రమాల‌తో సమాజ సేవకుడిగా ప్రసిద్ధి చెందారని కొనియాడారు. గద్దర్‌ అంతిమయాత్రలో తామంతా కలిసి ప్రయాణించడం, అప్పటి వరకు త‌మ‌తో ఉన్న వ్యక్తి గుండెపోటుతో మరణించడం షాకింగ్‌గా ఉందన్నారు. ఆయన మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన అకాలమరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ వారి కుటుంబానికి ఈ బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు.