Jasmine Flower | తొలి రాత్రి.. మల్లెపూలతో మగాళ్లకు మత్తెక్కుతుందా..?
Jasmine Flower | మల్లెపూలను( Jasmine Flowers )ఇష్టపడని వారెవరుంటారు.. శృంగార జీవితంలో ఎంతో కీలకపాత్ర పోషించే ఈ పూలను ప్రతి కొత్త పెళ్లి జంట( Newly Married Couple ) తొలిరాత్రి రోజున తప్పనిసరిగా ధరిస్తారు. మల్లెపూలు భార్యాభర్తల( Couples ) మధ్యన మూడ్ పెంచడమే కాకుండా.. మగాడిని మత్తులోకి దించుతుంది.

Jasmine Flower | తొలి రాత్రి.. పెళ్లాయ్యాక నవ దంపతులకు( Newly Marries Couple ) ఏర్పాటు చేసే ఘట్టం. అంటే పెళ్లాయ్యాక తొలిసారి ఆ నవ దంపతులు( Couples ) శారీరకంగా దగ్గరవడం. దీన్నే శోభనం అని కూడా అంటారు. ఈ శోభనానికి హిందూ సంప్రదాయం( Hindu Culture )లో అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఊరికే ఎప్పుడంటే ఎప్పుడు శోభనం చేయరు. దానికి ముహూర్తం కూడా ఉంటుంది. ఆ ముహుర్తం ప్రకారం కొత్త పెళ్లి జంటకు శోభనం ఏర్పాటు చేస్తారు.
ఇక శోభనం రోజున పెళ్లి కూతురును అందంగా ముస్తాబు చేస్తారు. కొత్తబట్టలు, నగలతో అలంకరిస్తారు. అంతే కాదండోయ్.. తలనిండా మల్లెపూలు( Jasmine Flowers ) పెడుతారు. జడ పొడవునా కూడా మల్లెపూలు అలంకరిస్తారు. ఇక నూతన దంపతులకు ఏర్పాటు చేసిన పడక( Bed )పై కూడా మల్లెపూలు, గులాబీ రేకులు చల్లి ఓ రసభరితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తారు. మరి ప్రకృతిలో అనేక రకాల పువ్వులు ఉంటాయి కదా… మరి మల్లెపూలకే ఎందుకంత ప్రాధాన్యం ఇస్తారంటే.. దానికి ఓ కారణం ఉంది.
మల్లెపూల నుంచి వెదజల్లే సువాసన ఎంతో ప్రశాంతతను కల్పిస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి ఉద్వేగాన్ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఒక రకమైన మత్తులోకి మల్లెపూలు మగాళ్లను తీసుకెళ్తాయి. దీంతో మగాడిలో కానీ మగువలో కానీ శృంగార కోరికలు మొదలవుతాయి. అందుకే తొలి రాత్రి అంటే శోభనం రోజున మల్లెపూలను గది మొత్తం అలంకరిస్తారు. నూతన వధువుకు కూడా మల్లెపూలను అలంకరించి.. మగాడిని మత్తులోకి దించుతారు.
అయితే మల్లెపూల వలన మెదడుకు ప్రశాంతత కలుగుతుంది. శృంగార సమయంలో దంపతులకు కావాల్సింది కూడా. ఎంత ప్రశాంతంగా ఉంటే అంతే స్థాయిలో శృంగార అనుభూతి పొందొచ్చు. ఉత్తేజం కూడా కలుగుతుంది. తద్వారా నవ దంపతులు తమ తొలిరాత్రిని గుర్తుండిపోయే విధంగా మధురానుభూతులతో గడుపుతారు.