ఎల్ఏసీ వద్ద 108 కిలోల బంగారం పట్టివేత
లడక్‌లోని భారత-చైనా సరిహద్దులో108 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు భారత-టిబెటన్ సరిహద్దు పోలీసు విభాగం ప్రకటించింది. ఒక్కొక్కటి కిలో బరువున్న 108 బంగారు బిస్కట్లను సరిహద్దు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

జూలై 10- లడక్‌లోని భారత-చైనా సరిహద్దులో108 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు భారత-టిబెటన్ సరిహద్దు పోలీసు విభాగం ప్రకటించింది. ఒక్కొక్కటి కిలో బరువున్న 108 బంగారు బిస్కట్లను సరిహద్దు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు లడక్‌లోని సిరిగపోల్ సమీపంలో పెట్రోలింగు చేస్తున్న పోలీసులు ఈ బంగారం పట్టుకున్నారు. డిప్యూటీ కమాండెంట్ దీపక్ భట్ నాయకత్వంలో బలగాలు వాస్తవాధీన రేఖకు కిలోమీటరు దూరంలో ఈ బంగారం స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి బంగారంతోపాటు మొబైల్ ఫోన్లు, కత్తులు, బైనాక్యులర్స్, చైనా తినుబండారాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో బంగారం పట్టుబడడం ఇదే మొదటిసారి. బంగారం విలువ 84 కోట్ల రూపాయలవరకు ఉంటుందని అంచనా.