81.5కోట్ల భారతీయు డేటా లీక్.. దర్యాప్తు దిశగా కేంద్రం

విధాత : ఐసీఎంఆర్ వద్ద అందుబాటులో ఉన్న 81.5కోట్ల మంది భారతీయుల డాటా హాకర్ల చేతికి చిక్కడం సంచలనం రేపుతున్నది. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతి పెద్ద డేటా లీక్ ఇదేకావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం దర్యాప్తు దిశగా చర్యలు చేపడుతున్నాయి. హాకర్స్ ఈ డేటాను గ్రే మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు.
అసలు హాకర్స్ వద్ద ఉన్న డేటా అసలైందేనా అన్న సందేహాలుంటే చెక్ చేసుకోవచ్చని శాంపిల్‌గా లక్ష మంది డేటాను హాకర్స్ వెల్లడించారు. వాటిని సరిపోల్చుకున్న ఐసీఎంఆర్ హాకర్స్ దగ్గర ఉన్న డేటా నిజమైందేనని తేల్చుకుంది. దీంతో డేటా చౌర్యంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు ఐసీఎంఆర్ సిద్దమవుతున్నది.
అయితే డేటా ఎక్కడి నుండి లీక్ అయిందో ఇంకా తెలియలేదు. వాస్తవానికి కోవిడ్ 19 డేటా ఎన్ఐసి, ఐసీఎంఆర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు వెళ్తుంది. డేటా లీకేజ్ ద్వారా డాక్టర్ల పర్సనల్ లాగిన్ ఆధారాలు, వినియోగదారుల పేర్లు, వారి పాస్ వర్డులు, పాస్ పోర్డులు, ఫోన్ నెంబర్లతో సహా గోప్యత ఉంచాల్సిన సమాచారమంతా లీక్ అయినట్లుగా భావిస్తున్నారు.
గత ఫిబ్రవరి నెల నుండి ఐసీఎంఆర్ డేటా బేస్ అనేకసార్లు సైబర్ దాడికి గురైందని, హా్కర్లు ఈ డెటాను 66లక్షలకు విక్రయించాలనుకున్నారని గుర్తించారు. గత నెలలో జార్ఖండ్‌లోని ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ హాక్ చేయబడిన విషయాన్ని అప్పటల్లో సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు కనుగొన్నారు 3.2 లక్షల మందికిపైగా రోగుల రికార్డులను అప్పట్లో హాకర్స్ బహిర్గతం చేశారు.