Khalil Ansari | 92 ఏండ్ల వ‌య‌సులో తొలిసారి ఓటేసిన అంధుడు.. ఎక్క‌డంటే..?

Khalil Ansari | 18 ఏండ్ల వ‌య‌సు నిండగానే ఓటు హ‌క్కు క‌ల్పించ‌బ‌డుతుంది. కానీ ఈ వృద్ధుడికి మాత్రం 92 ఏండ్ల వ‌య‌సులో ఓటు హ‌క్కు వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు త‌న జీవితంలో తొలిసారి ఓటు హ‌క్కును వినియోగించుకున్నాడు. మ‌రి ఆ వ్య‌క్తి వివ‌రాలు తెలుసుకోవాలంటే జార్ఖండ్ రాష్ట్రం వెళ్లాల్సిందే.

Khalil Ansari | 92 ఏండ్ల వ‌య‌సులో తొలిసారి ఓటేసిన అంధుడు.. ఎక్క‌డంటే..?

Khalil Ansari | రాంచీ : 18 ఏండ్ల వ‌య‌సు నిండగానే ఓటు హ‌క్కు క‌ల్పించ‌బ‌డుతుంది. కానీ ఈ వృద్ధుడికి మాత్రం 92 ఏండ్ల వ‌య‌సులో ఓటు హ‌క్కు వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు త‌న జీవితంలో తొలిసారి ఓటు హ‌క్కును వినియోగించుకున్నాడు. మ‌రి ఆ వ్య‌క్తి వివ‌రాలు తెలుసుకోవాలంటే జార్ఖండ్ రాష్ట్రం వెళ్లాల్సిందే.

జార్ఖండ్ రాజ్‌మ‌హ‌ల్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని మండ్రో పోలింగ్ కేంద్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. సాహిబ్‌గంజ్‌కు చెందిన ఖ‌లీల్ అన్సారీ అనే వ్య‌క్తి అధికారుల‌కు తార‌స‌ప‌డ్డాడు. దృష్టి లోపంతో బాధ‌ప‌డుతున్న అన్సారీని చూసి.. ఓటు హ‌క్కు ఉందా..? అని అధికారులు ప్ర‌శ్నించారు. దీంతో త‌న‌కు ఓటు లేద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు పోలింగ్ కేంద్రం వైపు వెళ్ల‌లేద‌ని అన్సారీ స్ప‌ష్టం చేశాడు. దీంతో వెంట‌నే ఆయ‌న పేరును ఓట‌రు జాబితాలో చేర్చాల‌ని జార్ఖండ్ సీఈవో ర‌వికుమార్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ క్ర‌మంలోనే అన్సారీకి ఓటు క‌ల్పించ‌బ‌డింది.

శ‌నివారం రాజ్‌మ‌హ‌ల్ పార్లమెంట్‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మండ్రోలోని ప‌దో నంబ‌ర్ పోలింగ్ కేంద్రంలో అన్సారీ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నాడు. ఈ సంద‌ర్భంగా అన్సారీ మాట్లాడుతూ.. తొలిసారి ఓటు హ‌క్కును వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపారు.