నకిలీ ఆధార్‌లతో పార్లమెంటులో చొరబడేందుకు యత్నం పట్టుకున్న .. సీఐఎస్‌ఎఫ్ బలగాలు
ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్‌లోకి చొరబడేందుకు విఫల యత్నం చేసిన ఘటన కలకలం రేపింది. నకిలీ ఆధార్ కార్డును తయారు చేసి గేట్ నంబర్ 3 ద్వారా పార్లమెంట్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు.

విధాత :ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్‌లోకి చొరబడేందుకు విఫల యత్నం చేసిన ఘటన కలకలం రేపింది. నకిలీ ఆధార్ కార్డును తయారు చేసి గేట్ నంబర్ 3 ద్వారా పార్లమెంట్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ భద్రతా సిబ్బంది సీఐఎస్ఎప్ బలగాలు ముగ్గురిని పట్టుకున్నాయి. ఆ ముగ్గురిని ఖాసిం, మోనిస్, షోయబ్‌గా గుర్తించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ ఎంపీల సమావేశానికి ముందు ఉదయం ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది.
పట్టుబడిన ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు. కాగా వారు ఎందుకు అక్కడి వచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉగ్రవాద కుట్రలో భాగంగా వీరు పార్లమెంటులోకి ప్రవేశించే ప్రయత్నం చేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు. కొద్ది నెలల క్రితమే పార్లమెంటులోకి అక్రమంగా చొరబడిన దుండుగులు పొగ బాంబులు వేసిన ఉదంతం మరువకముందే తాజాగా మరో చొరబాటు వెలుగుచూడటం..18వ లోక్‌సభ కొలువుతీరనున్న నేపథ్యంలో పార్లమెంటు భద్రతను, నిఘాను పెంచారు.