Wagh Nakh | లండన్ నుంచి ముంబయికి చేరిన ఛత్రపతి శివాజీ ఆయుధం ‘వాఘ్ నఖ్..!
Wagh Nakh | మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆయుధం వాఘ్ నఖ్ ఎట్టకేలకు ముంబయికి చేరింది. లండలోని ప్రఖ్యాత విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. అయితే, అనేక ప్రయత్నాలు తర్వాత దాదాపు వందల సంవత్సరాల తర్వాత తిరిగి ఈ ఆయుధం మళ్లీ తిరిగి భారత్ చేరుకుంది.

Wagh Nakh | మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆయుధం వాఘ్ నఖ్ ఎట్టకేలకు ముంబయికి చేరింది. లండలోని ప్రఖ్యాత విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. అయితే, అనేక ప్రయత్నాలు తర్వాత దాదాపు వందల సంవత్సరాల తర్వాత తిరిగి ఈ ఆయుధం మళ్లీ తిరిగి భారత్ చేరుకుంది. బుల్లెట్ ప్రూఫ్ కవర్లో ఉంచి ఈ ఆయుధాన్ని భారత్‌కు తరలించారు. శివాజీ ఉపయోగించిన ఈ వాఘ్ నఖ్ లండన్ నుంచి ముంబయి చేరుకున్నట్లు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటివార్ తెలిపారు. సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ఈ వాఘ్ నఖ్‌ను ఏడు నెలల పాటు ప్రదర్శనకు ఉంచనున్నట్లు వివరించారు.
శుక్రవారం నుంచి ప్రదర్శనకు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నారు. వీర మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ యుద్ధ సమయాల్లో ఉపయోగించే ప్రత్యేకమైన ఆయుధమే ఈ వాఘ్ నఖ్. ఇది పులి పంజా ఆకారంలో ఉంటుంది. లోహంతో తయారైన వాఘ్ నఖ్‌ను ధరించి ఎదుటి వ్యక్తి శరీరాన్ని చీల్చి చేసేందుకు అవకాశం ఉంటుంది. 1659లో బీజాపూర్ సామ్రాజ్య సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్‌ను చంపేందుకు శివాజీ ఈ వాఘ్ నఖ్‌ను ఉపయోగించినట్లుగా చరిత్ర చెబుతున్నది. కాలక్రమంలో ఈ చారిత్రక వస్తువు బ్రిటన్ చేరింది. తాజాగా మళ్లీ భారత్‌కు తిరిగి వచ్చింది. దీనిపై మరాఠా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.