Symbolic Funeral | కూతురు ప్రేమ వివాహం.. డప్పుదరువులతో అంత్యక్రియలు నిర్వహించిన తండ్రి..
Symbolic Funeral | ఓ యువతి తనకు నచ్చిన యువకుడిని ప్రేమించి( Love ) పెళ్లాడింది. ఇది తన తండ్రికి ఇష్టం లేదు. తక్కువ కులం వాడిని తన కుమార్తె ప్రేమ పెళ్లి( Love Marriage ) చేసుకుందని చెప్పి.. ఆమె చనిపోయిందని భావించి ప్రతీకాత్మక అంత్యక్రియలు( Symbolic Funeral ) నిర్వహించాడు తండ్రి.

Symbolic Funeral | ఓ యువతి తనకు నచ్చిన యువకుడిని ప్రేమించి( Love ) పెళ్లాడింది. ఇది తన తండ్రికి ఇష్టం లేదు. తక్కువ కులం వాడిని తన కుమార్తె ప్రేమ పెళ్లి( Love Marriage ) చేసుకుందని చెప్పి.. ఆమె చనిపోయిందని భావించి ప్రతీకాత్మక అంత్యక్రియలు( Symbolic Funeral ) నిర్వహించాడు తండ్రి. ఈ ఘటన ఒడిశా( Odisha )లోని గంజాం జిల్లా( Ganjam District )లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గంజాం జిల్లా కబీసూర్యనగర్ తహసీల్ పరిధిలోని బాలియాపల్లి గ్రామానికి చెందిన గౌడ అనే వ్యక్తికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఇందులో మూడో కుమార్తె నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. అది కూడా తన కులం కంటే తక్కువ కులం వాడిని పెళ్లాడింది ఆమె. ఈ పెళ్లి గౌడకు ఇష్టం లేదు. దీంతో నెల రోజుల తర్వాత తన కూతురు చనిపోయిందని భావించాడు తండ్రి. ఇక ఒకరు చనిపోతే ఎలాగైతే అంత్యక్రియలు నిర్వహిస్తారో.. ఆ మాదిరి నిర్వహించాడు.
పాడెను తయారు చేసి.. దానిపై ఓ కర్రను ఉంచి.. దానికి కొత్తను చీరను కట్టాడు. ఇక డప్పు దరువులతో శవాన్ని ఊరేగించాడు. గ్రామస్తులు కూడా ఎవరో చనిపోయారని భావించి.. ఇండ్ల నుంచి బయటకు వచ్చి చూడడం ప్రారంభించారు. అనంతరం స్మశాన వాటికకు తరలించి.. చితికి నిప్పంటించాడు తండ్రి. శవయాత్ర ఊరేగింపులో కుటుంబ సభ్యులంతా బోరున విలపించారు. అయితే అది ఉత్తుత్తి శవయాత్ర అని తెలుసుకున్న గ్రామస్తులు షాకయ్యారు.
ఈ సందర్భంగా గౌడ మాట్లాడుతూ.. తన బిడ్డ తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుంది. మా కమ్యూనిటీలో నాకు తీవ్ర అవమానం జరిగింది. దీంతో కూతురు చనిపోయిందని భావించి, అంత్యక్రియలు నిర్వహించాను. తాను, తన భార్య పస్తులుండి.. నలుగురు కుమార్తెలను, ఒక కుమారుడిని పోషించాం. చివరకు మూడో కుమార్తె తమ ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుంది. తమను కాదని పెళ్లి చేసుకున్న ఆమె చనిపోయిందని భావించాం.. అంత్యక్రియలు నిర్వహించాం అని గౌడ చెప్పుకొచ్చాడు.