ఢిల్లీ గర్ల్స్ హాస్టల్‌లో షాకింగ్ ఘటన.. భారీగా కండోమ్స్ !

ఢిల్లీలోని ఓ గర్ల్స్ పీజీ హాస్టల్ డ్రైనేజ్ లైన్‌లో భారీ సంఖ్యలో కండోమ్స్ బయటపడిన ఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గర్ల్స్ హాస్టల్‌లో ఇంత పెద్ద సంఖ్యలో కండోమ్స్ బయటపడటం చర్చనీయాంశమైంది. ఈ ఘటన ఆధునిక సమాజం జీవన శైలి, నైతిక విలువలు, హాస్టల్ పర్యవేక్షణ, యువత ప్రవర్తనపై పెద్ద చర్చకు దారితీస్తోంది.

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ గర్ల్స్ పీజీ హాస్టల్ డ్రైనేజ్ లైన్‌లో భారీ సంఖ్యలో కండోమ్స్ బయటపడిన ఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గర్ల్స్ హాస్టల్‌లో ఇంత పెద్ద సంఖ్యలో కండోమ్స్ బయటపడటం చర్చనీయాంశమైంది. ఈ ఘటన ఆధునిక సమాజం జీవన శైలి, నైతిక విలువలు, హాస్టల్ పర్యవేక్షణ, యువత ప్రవర్తనపై పెద్ద చర్చకు దారితీస్తోంది.

హాస్టల్ డ్రైనేజ్ లైన్ అకస్మాత్తుగా పూర్తిగా బ్లాక్ కావడంతో నిర్వాహకులు శానిటేషన్ సిబ్బందిని పిలిపించినట్లు సమాచారం. అయితే వారు మెయిన్ సీవర్ లైన్‌ను తెరిచి పరిశీలించగా, నీటి బదులు భారీ సంఖ్యలో కండోమ్స్ బయటకు రావడం అందరినీ షాక్‌కు గురిచేసిందని తెలుస్తోంది.దీన్ని చూసి పారిశుధ్య కార్మికులు సైతం నివ్వెరపోయారు. వాటి కారణంగా డ్రైనేజ్ వ్యవస్థ జామ్ అయిపోయినట్లు వెల్లడైంది.

యువతుల కోసం నిర్వహించే గర్ల్స్ హాస్టల్‌ వద్ద ఇంత పెద్ద సంఖ్యలో కండోమ్స్ బయటపడటం అసలు దేనికి సంకేతం? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం ఉందా? అక్కడ నియమాలు ఎంతవరకు అమలవుతున్నాయి? అన్నప్రశ్నలు వినిపిస్తున్నాయి. విద్యార్థినులపై సరైన పర్యవేక్షణ ఉందా? లేదా ? అనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై హాస్టల్ యాజమాన్యం అధికారికంగా ఇంకా స్పందించలేదు.

యువత మారిపోతుందా..?

గర్ల్స్ హాస్టల్‌ వద్ద పెద్ద సంఖ్యలో కండోమ్స్ బయటపడిన ఘటన..ఆధునిక యువతలో నైతిక విలువలు క్రమంగా తగ్గిపోతున్నాయనే అభిప్రాయాలకు ఊతమిస్తుంది. సోషల్ మీడియా ప్రభావం, పూర్తిస్థాయి స్వేచ్ఛ, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, ఆధునిక జీవనశైలి పేరుతో బాధ్యతారాహిత్య, విచ్చలవిడి జీవన శైలీ ధోరణులు పెరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చదువు, కెరీర్ కోసం ఇంటి దూరంగా హాస్టల్స్‌లో ఉండే యువతలో నియంత్రణ తగ్గుతోందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత హాస్టల్స్‌లో భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ విధానాలు, విద్యార్థుల ప్రవర్తనపై మరింత కఠిన చర్యలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లలతో సమయం గడుపుతూ సరైన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది.

మరోవైపు ఎవరి వ్యక్తిగత జీవితం వారి స్వంతమైనప్పటికీ సామాజిక బాధ్యత కూడా ఉంటుందని, సామూహిక వసతి గృహాల్లో పరిశుభ్రత, నియమ నిబంధనలుతప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. డ్రైనేజ్ లైన్లలో కండోమ్స్ వంటి వస్తువులు వేయడం వల్ల పైపు లైన్లు బ్లాక్ అవ్వడమే కాకుండా దుర్వాసన, బ్యాక్టీరియా వ్యాప్తి వంటి ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

షాకింగ్..హైదరాబాద్ నగరంలో మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీ
The Paradise | ‘ది ప్యారడైజ్’ మూవీ రీషూట్ చేయ‌బోతున్నారా.. అవాక్క‌వుతున్న అభిమానులు

Latest News